Site icon HashtagU Telugu

OG Mania : ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్న ‘OG’ సంబరాలు

Og Menia Us

Og Menia Us

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం OG విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ మూవీ గురువారం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుండగా, బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా, ఓవర్సీస్‌లో కూడా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని డల్లాస్ సిటీలో ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి, దానిపై పూల దండలు వేసి వాతావరణాన్ని సందడిగా మార్చేశారు. ముఖ్యంగా ఖుషీ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ “అమ్మాయే సన్నగా… అరనవ్వే నవ్వగా…”కు యూత్ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇప్పటికీ ఎక్కడా తగ్గలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

14 అడుగుల ఆత్మలింగం, మాణిక్యాంబ శక్తిపీఠం ఆంధ్రాలో ఎక్కడ ఉందో తెలుసా?

ఇక OG సినిమాకు సెన్సార్ బోర్డ్ నుండి “A” సర్టిఫికెట్ రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ట్రైలర్‌లో కనిపించినట్టుగానే మూవీలో మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో, సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్స్ తొలగించమని సూచించింది. ముఖ్యంగా చేతి నరికే సీన్, తల నరికే సీన్‌లను కట్ చేయమని ఆదేశించింది. దాంతో దాదాపు 1.55 నిమిషాల ఫుటేజ్ తొలగించిన తర్వాత, సినిమా ఫైనల్ రన్‌టైమ్ రెండున్నర గంటలకు చేరుకుంది. పవన్‌ను పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో చూడాలన్న వారి కోరికను దర్శకుడు సుజీత్ నెరవేర్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అదనంగా ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ వంటి శక్తివంతమైన నటులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు మరింత బలాన్నిచ్చింది. తమన్ సంగీతం ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచింది. పవన్ భారీ స్థాయిలో యాక్షన్, స్టైల్‌తో అలరిస్తారని ఊహిస్తూ అభిమానులు థియేటర్స్‌కి తరలి వెళ్లేందుకు గంటలనే లెక్కపెడుతున్నారు.

Exit mobile version