Priyanka Arul Mohan : విలన్ తో పవన్ హీరోయిన్ స్టెప్పులు..!

Priyanka Arul Mohan తెలుగులో గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాలు చేసిన చెన్నై చిన్నది ప్రియాంక అరుల్ మోహన్ లేటెస్ట్ గా తెలుగులో పవర్ స్టార్ తో OG, నానితో

Published By: HashtagU Telugu Desk
Og Heroine Priyanka Arul Mohan Dance With Villain Sj Surya

Og Heroine Priyanka Arul Mohan Dance With Villain Sj Surya

Priyanka Arul Mohan తెలుగులో గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాలు చేసిన చెన్నై చిన్నది ప్రియాంక అరుల్ మోహన్ లేటెస్ట్ గా తెలుగులో పవర్ స్టార్ తో OG, నానితో సరిపోదా శనివారం సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలతో తెలుగులో మళ్లీ బిజీ అవ్వనుంది. ఇక ఈ సినిమాలతో పాటుగా కోలీవుడ్ లో కూడా ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటించింది అమ్మడు. అరుణ్ మత్తేశ్వరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది అమ్మడు.

We’re now on WhatsApp : Click to Join

ఇదిలాఉంటే లేటెస్ట్ గా ప్రియాంక ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో స్టెప్పులతో అలరించింది. తమిళనాడు ఇన్ కం ట్యాంక్స్ ఆఫీస్ లో జరిగిన ఈవెంట్ లో పాల్గొన్న ప్రియాంక అక్కడ యాక్టర్ కం డైరెక్టర్ ఎస్.జె సూర్యతో కలిసి స్టెప్పులు వేసింది. ధనుష్ ఫేవరెట్ ట్రాక్ కు సింపుల్ డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది అమ్మడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న ప్రియాంక ఈ ఇయర్ లో తన సినిమాలతో సత్తా చాటాలని చూస్తుంది. పవన్ ఓజీ, నానితో సరిపోదా శనివారం సినిమాలు మాత్రం క్రేజీ ప్రాజెక్ట్స్ గా రాబోతున్నాయి. ఈ సినిమాలతో తెలుగులో బిజీ హీరోయిన్ గా మారాలని చూస్తుంది ప్రియాంక.

Also Read : Sankranthi Release : సంక్రాంతి నుంచి ఆ సినిమాలు డ్రాప్..!

  Last Updated: 02 Jan 2024, 03:49 PM IST