Site icon HashtagU Telugu

OG Glimpse: రికార్డు సృష్టించిన ‘OG’ గ్లింప్స్.. టాలీవుడ్ లో అత్యధిక లైక్స్ పొందిన గ్లింప్స్ గా పవన్ మూవీ..!

OG Glimpse

Og

OG Glimpse: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా గ్లింప్స్ (OG Glimpse) రికార్డు సృష్టించింది. 24 గంటల్లోనే 730K లైక్స్ సాధించి.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక లైక్స్ పొందిన గ్లింప్స్ వీడియోగా నిలిచింది. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ‘ భీమ్లానాయక్’ సినిమా గ్లింప్స్ పై (728K) ఉన్న ఈ రికార్డును ‘OG’ బ్రేక్ చేసింది. OG గ్లింప్స్ కు 24 గంటల్లోనే 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

రీసెంట్‌గా బ్రో సినిమాతో ఫ్యాన్స్ కావాల్సిన ఎంటర్‌టైన్‌ మెంట్‌ అందించిన పవన్ ప్రస్తుతం ఓజీ (OG) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీని సాహో ఫేం సుజిత్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్‌ కల్యాణ్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన ఓజీ గ్లింప్స్‌ మూవీ లవర్స్‌తోపాటు అభిమానులకు విజువల్‌ ట్రీట్ అందిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఓజీ #HUNGRYCHEETAH హ్యాష్‌ ట్యాగ్‌తో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

ప్ర‌చార చిత్రాల‌తో షూటింగ్ ద‌శ‌లోనే ఈ మ‌ధ్య కాలంలో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న సినిమా ఇదే. ఆ స్థాయిలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్‌ల‌ని రిలీజ్ చేస్తూ మేక‌ర్స్‌, డైరెక్ట‌ర్ `ఓజీ`పై భారీ స్థాయిలో బ‌జ్‌ని క్రియేట్ చేశారు. అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా నేప‌థ్యంలో సుజీత్ ఇంత‌కు ముందు `సాహో` సినిమాని రూపొందించాడు. ప్ర‌తి సీన్ హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేయ‌డ‌మే కాకుండా ప్ర‌భాస్‌ని చూపించిన తీరు కూడా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. దీంతో గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా రూపొందుతున్న `ఓజీ`లోనూ అంత‌కు మించిన స్థాయిలో ప‌వ‌న్‌ని చూపిస్తాడ‌ని ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

Also Read: Rajinikanth – Himalayas : రజనీకాంత్ హిమాలయాల టూర్ వీడియో ఇదిగో

ఓజీ చిత్రంలో గ్యాంగ్ లీడర్‌ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా‌.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్‌ డిజైనర్‌. ఓజీలో వచ్చే కీలక సన్నివేశాలను ఇప్పటికే ముంబై, పూణే, హైదరాబాద్‌ షెడ్యూల్స్‌లో పూర్తి చేశారని తెలిసిందే. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అవుతున్నా.. దీని నుంచి పెద్దగా అప్‌డేట్లు రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందారు. అదే సమయంలో ఏదైనా కానుకను అందించాలని కోరుకున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ బర్త్‌డేను పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన ‘OG’ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు.