Site icon HashtagU Telugu

Devara Release : ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

Ntr Requested Vetrimaran To Do Straight Tamil Movie

Ntr Requested Vetrimaran To Do Straight Tamil Movie

టాలీవుడ్ (Tollywood) తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న “దేవర” (Devara) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala siva) కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర”. జనతా గ్యారేజ్ తర్వాత శివ – ఎన్టీఆర్ కలయిల్లలో సినిమా తెరకెక్కడం..అది కూడా ఎన్టీఆర్ సోలో గా ఆరేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడం తో సినిమాను చూసేందుకు అభిమానులు , సినీ లవర్స్ పోటీ పడ్డారు. అభిమానుల ఎదురుచూపులు తగ్గట్లే సినిమా ను భారీ ఎత్తున రిలీజ్ చేసారు.

దేవర రిలీజ్ సందర్బంగా ఎన్టీఆర్ (NTR Tweet) ఎమోషనల్ ట్వీట్ చేసారు. అభిమానులు అందరి ఆదరణ చూస్తే సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు. ఎమోషనల్ గా, ఎంతో ఎంగేజింగ్ గా దేవర సినిమాని ఊహించి.. తెరకెక్కించినందుకు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. దేవర ప్రపంచానికి అనిరుధ్ సంగీతం ప్రాణం పోసిందని తెలిపాడు. ఈ మూవీకి పిల్లర్స్ లా ఉన్న ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. దేవర కోసం పనిచేసిన ప్రతి టెక్నీషీయన్ కి తారక్ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే తన ఫ్యాన్స్ ప్రేమ, ఆదరణకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. మీరు అందరూ కూడా దేవరను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం నన్ను ఎంతో సంతోష పెట్టిందని చెప్పుకొచ్చాడు. తన అభిమానులకు ఇలాంటి ఎంటర్ టైన్మెంట్ తప్పక ఇస్తానంటూ ఎన్టీఆర్ ప్రామిస్ చేశాడు.

కాకపోతే సినిమా అభిమానుల అంచనాలు అందుకోవడం లో విఫలమైంది. కథలో కొత్తదనం లేకపోవడం , స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం , బోరింగ్ సన్నివేశాలతో విసుగు తెప్పించాడు శివ. కేవలం ఎన్టీఆర్ తోనే సినిమా నడిచింది. ఇక జాన్వీ పాత్ర కూడా పెద్దగా లేకపోవడం..సినిమాలో హైలైట్ అనుకున్న సాంగ్ ను సైతం లేపేయడం తో అభిమానులు పూర్తిగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తో ఎన్టీఆర్ స్థాయి ఎక్కడికి వెళ్తుందనుకుంటే ఇలా చేశావేంటి శివ అని మండిపడుతున్నారు.

Read Also : Tirumala Laddu Issue : అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం