యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’ పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’ మరియు ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్లను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా షూటింగ్ నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్ తిరిగి గాడిలో పడేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సమాచారం ప్రకారం, ఈ నెల మూడో వారంలో షూటింగ్ పునఃప్రారంభం కానుంది. కొత్త షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.
Pregnancy Diet: ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా తీసుకోవాల్సిన కూరగాయలు.. అస్సలు మిస్ చేయకండి!
ఈ షెడ్యూల్ కోసం నార్త్ యూరప్ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మంచుతో కప్పిన పర్వత ప్రాంతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక వనరులతో కూడిన యాక్షన్ సీక్వెన్సులను దర్శకుడు నీల్ డిజైన్ చేశారని సమాచారం. హాలీవుడ్ స్థాయి యాక్షన్ టీమ్ ఈ సన్నివేశాలపై పని చేస్తుందని చెప్పబడింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ షెడ్యూల్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందనే నమ్మకం చిత్రబృందంలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాల్లో కనిపించే కొత్త అవతారం అభిమానులను ఆశ్చర్యపరచనుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు భారీ స్థాయి ఇంపాక్ట్ ఇవ్వబోతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, ఆమె పాత్రకు కూడా గట్టి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. డ్రాగన్ సినిమా తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ నుంచి ఏ స్థాయి మాస్ అద్భుతం రాబోతుందో అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా పెరుగుతోంది.
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
