Site icon HashtagU Telugu

Drug Mafia : డ్ర‌గ్ మాఫియాతో ఎన్టీఆర్ కు సంబంధం..?

Ntr Drag

Ntr Drag

ఏంటి టైటిల్ చూసి ఖంగారుపడుతున్నారా..? డ్ర‌గ్ మాఫియా(Drug Mafia)తో ఎన్టీఆర్ (NTR) కు సంబంధం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది రియల్ గా కాదులెండి. ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్ర కథ. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్..ప్రస్తుతం KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ తాలూకా ఓపెనింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం మేకర్స్ ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఈ సినిమా కోసం మ‌ల‌యాళం నుంచి బీజూ బీన‌న్‌ని, టోవినో థామ‌స్‌ని ఎంపిక చేసారు. అలాగే ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వ‌సంత్ ఖ‌రారు అయ్యింది. మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపు పూర్తి అయ్యిందని సమాచారం.

Mahakumbh 2025 : మహా కుంభ మేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం

ఇక ఈ సినిమా కథ డ్ర‌గ్ మాఫియా చుట్టూ తిరుగుతుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. మ‌య‌న్మార్‌, థాయ్ లాండ్‌, లాయిస్‌లను క‌లిపి భౌగోళికంగా గోల్డెన్ ట్ర‌యాంగిల్ అనిపిలుస్తాయి. ఇక్క‌డి నుంచి కొకైన్‌, గంజాయి ఎక్కువ‌గా స్మ‌గ్లింగ్ అవుతుంటుంది. డ్ర‌గ్ సామ్రాజ్యానికి అదో స్వ‌ర్గం లాంటిది. అక్క‌డ జ‌రిగే అరాచ‌కాలు, అక్ర‌మాల నేప‌థ్యంలో ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ ల సినిమా న‌డుస్తుంద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి ‘డ్రాగ‌న్‌’ అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఈనెలాఖ‌రున షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే 2026 సంక్రాంతి బరిలో ఈ సినిమాను దించాలని మేకర్స్ ప్లాన్. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ and NTR ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.