Site icon HashtagU Telugu

NTR Video Call With Kaushik : చావు బతుకుల మధ్య ఉన్న అభిమానితో మాట్లాడిన ఎన్టీఆర్

Ntr Video Call

Ntr Video Call

NTR Video Call With Tirupathi Fan Kaushik : బోన్ క్యాన్సర్‌ (Battling Cancer)తో చావు బతుకుల మధ్య ఉన్న అభిమాని కౌశిక్ (Kaushik ) తో ఎన్టీఆర్ (NTR Video Call) మాట్లాడి..ఆ కుర్రాడిలో సంతోషం నింపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు వచ్చిన..ఎన్టీఆర్ నుండి సినిమా వచ్చిన అభిమానులు పెద్ద పండగల భావిస్తారు. థియేటర్స్ ను ముస్తాబు చేయడం , భారీగా ప్లెక్సీలు , కటౌట్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. అలాంటి అభిమానుల్లో కౌశిక్ (19) అనే కుర్రాడు ఒకడు. కాగా కొద్దీ రోజులుగా బోన్ కాన్సర్ తో కౌశిక్ బాధపడుతున్నాడు.సంపాదించినదంతా కొడుకు ఆరోగ్యం కోసం ఖర్చు చేశారు తల్లిదండ్రులు. చివరకు కూడ బెట్టుకున్న ఆస్తులను సైతం అమ్మేశారు. దేవర సినిమా విడుదలైన వరకు తన కొడుకును బతికించమని ఆ తల్లి మీడియా ఎదుట కన్నీరు పెట్టుకుంది. ట్రీట్‌మెంట్ చేయాలంటే ఒక్కో ఇంజెక్షన్ మూడు లక్షల రూపాయలని, అలాంటివి 12 ఇంజెక్షన్లు చేయాలని డాక్టర్లు అన్నట్లు చెప్పుకొచ్చారు. దేవర (Devara) సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

చనిపోయే ముందు తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా చూడాలన్నది కౌశిక్ కోరిక. అప్పటివరకు తన కొడుకును బతికించాలంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ విషయం ఎన్టీఆర్ దృష్టికి చేరింది. వెంటనే కౌశిక్కు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఏమాత్రం భయపడొద్దని.. నవ్వుతుంటే బాగున్నావంటూ అతడిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరెక్కుతున్న ‘దేవర’ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వర్క్స్ స్పీడ్ అందుకున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే థియేటర్లో పూనకాలే అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

Read Also : Sebi Chief : ఆ స్టాక్స్‌లో సెబీ చీఫ్ ట్రేడింగ్.. కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు