Site icon HashtagU Telugu

Jr Ntr: ఆ యాక్సిడెంట్ తర్వాత నేను బతికింది దానికోసమే: ఎన్టీఆర్

5d9bcba5 B0c9 4e49 86cd 8ecdee853c28

5d9bcba5 B0c9 4e49 86cd 8ecdee853c28

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో నటించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఇప్పుడు దేవర మూవీ చేస్తున్నారు. ఈ మూవీ దసరా పండుగ కానుకగా విడుదల కానుంది. ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 10కి వాయిదా వేశారు మూవీ మేకర్స్.

We’re now on WhatsApp. Click to Join
ఇది ఇలా ఉంటే 2009 తెలుగు దేశం పార్టీ కోసం చేసిన ప్రచారం ఒక సంచలనం అనే చెప్పాలి. ఆ ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాంతో తారక్ కి తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే ఆందోళనకరంగా ఏమి జరగకపోవడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. బలమైన గాయాలు అయినప్పటికీ తారక్ కోలుకుని తిరిగి అదే ఎనేర్జితో వచ్చారు. ఆ యాక్సిడెంట్ తర్వాత ఎన్టీఆర్ ఆలోచన సరళి మారిందట. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయట పెట్టాడు. ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నీ మైండ్ లో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి అని మంచు లక్ష్మి ప్రశ్నించగా మనం బతికినన్ని రోజులు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తూ ఏదో ఒకటి సాధించాలి.

Also Read: Parasuram: ఫ్యామిలీ స్టార్ రెస్పాన్స్ పై అలాంటి కామెంట్స్ చేసినా డైరెక్టర్ పరుశురాం?

చావు ఎదురొస్తే దానిని స్వీకరించాలి. నాకు జరిగిన యాక్సిడెంట్ లో చనిపోతానని నేను అనుకోలేదు. నాలో ఏదో తెలియని బలమైన కాన్ఫిడెన్స్ ఉండింది. ఇంత త్వరగా చనిపోను అనే నమ్మకం కావచ్చు.. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది కదా అనే నమ్మకం కావచ్చు.. ఏదో ఒక నమ్మకం వల్ల బతికాను. మరీ వరస్ట్ గా కాకుండా 6 నెలల్లో కోలుకున్నాను. ఆ యాక్సిడెంట్ తర్వాత నా ఆలోచనలో మాత్రం మార్పు వచ్చింది. నేను చూడాల్సింది చాలా ఉంది.. సాధించాల్సింది చాలా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీలైనంత త్వరగా చేయాల్సినవి చేయాలి. అలాగే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు అని తెలిపారు తారక్.

Also Read: Anupama Parameswaran: మరోసారి రెచ్చిపోయిన టిల్లు బ్యూటీ.. అందం చూస్తే మత్తెక్కాల్సిందే?