NTR Shirtless Mass Mania : ఎన్టీఆర్ మరోసారి షర్ట్ విప్పుతున్నాడా.. వార్ 2 తో రచ్చ కన్ఫర్మ్..!

NTR Shirtless Mass Mania యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తూనే మరోపక్క అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 కూడా చేస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - May 18, 2024 / 11:10 AM IST

NTR Shirtless Mass Mania యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తూనే మరోపక్క అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 కూడా చేస్తున్నాడు. వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నా.. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తారని టాక్. అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఒక రేంజ్ లో ప్లాన్ చేశారని తెలుస్తుంది.

బాలీవుడ్ లో ఎన్టీఆర్ చేస్తున్న తొలి సినిమా కావడంతో వార్ 2 మీద తెలుగు ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వార్ 2 లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేస్తారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం తారక్ మరోసారి షర్ట్ విప్పుతాడని అంటున్నారు.

స్టార్ హీరోలు షర్ట్ విప్పి ఫైట్ చేస్తే ఆ యాటిట్యూడ్ వేరే రేంజ్ లో ఉంటుంది. అరవింద సమేత సినిమా కోసం ఎన్టీఆర్ షర్ట్ విప్పి ఫైట్ చేశాడు. ఆ సినిమా కోసం తారక్ ఎయిట్ ప్యాక్ ట్రై చేశాడు. మళ్లీ వార్ 2 కోసం అదే రేంజ్ లో కనిపించబోతున్నాడని అంటున్నారు. వార్ 2 లో యాక్షన్ సీన్స్ నువ్వా నేనా అనేలా హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఫైటింగ్ ఉంటుందని తెలుస్తుంది.

దేవర సినిమాతో అక్టోబర్ 10న వస్తున్న ఎన్టీఆర్.. వార్ 2 ని నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా ఉంటుందని తెలిసిందే.

Also Read : CSK vs RCB IPL : నేటి ఐపిఎల్ మ్యాచ్ లో ఇండియన్ 2 టీం.. కమల్ తో పాటు శంకర్ కూడా..!