Site icon HashtagU Telugu

Rajamouli Sentiment : రాజమౌళి సెంటిమెంట్ ప్రచారం పై ఎన్టీఆర్ ఏమన్నాడంటే..!!

Ntr About Rajamouli Sentime

Ntr About Rajamouli Sentime

చిత్రసీమలో సెంటిమెంట్ అనేది ఎక్కువగా నమ్ముతారు. హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడం..కలిసొచ్చే హీరోయిన్లను ఓకే చేయడం..అలాగే పలు ఈవెంట్స్ కూడా పలు ప్లేస్ లలో చేస్తే సినిమా హిట్ అవుతుందని నమ్మడం..రిలీజ్ డేట్స్ విషయంలో..ఇలా ప్రతిదీ సెంటిమెంట్ ప్రకారం చేసుకుంటుంటారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేసిన హీరో..నెక్స్ట్ మూవీ ప్లాప్ అవుతుందనే సెంటి మెంట్ కూడా ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉంది.

స్టూడెంట్ నెం 1 (Student No 1) దగ్గరి నుండి మొన్నటి RRR వరకు ప్రతి హీరో నెక్స్ట్ సినిమాలు ప్లాప్స్ కావలిసిందే. చిత్రసీమలో ప్లాప్ అంటే తెలియని డైరెక్టర్ రాజమౌళి (Rajamouli). ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ (Movies) బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు కావడమే కాదు ఆయా హీరోల రేంజ్ ను పెంచిన సినిమాలు..టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసిన సినిమాలు. అలాంటి ట్రాక్ రికార్డు రాజమౌళికి సొంతం. జక్కన్న సినిమాలు ఇప్పటి వరకు లెక్క తప్పలేదు. ఆలస్యం అవుతాయనే టాక్ మినహా ఏ ఇబ్బంది లేదు ఆయన సినిమాలకు. రాజమౌళి ట్రాక్ రికార్డు బాగున్నప్పటికీ..రాజమౌళి తో సినిమాలు చేసిన తర్వాత ఆయా హీరోల ట్రాక్ రికార్డు (Heros Track record) మాత్రం డిజాస్టర్ (Disaster ) గా ఉంటుంది.

రాజమౌళి తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్ తో ఎంత మంచి కథ తో చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ప్లాప్ అవ్వాల్సిందే. స్టూడెంట్ నెం 1 తో ఎన్టీఆర్ (NTR) సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ప్లాప్స్ పడ్డాయి. రామ్ చరణ్ (Ram Charan) విషయంలో కూడా ఇదే జరిగింది. మగధీర తో మెగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న..ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ కాదు కదా..కనీసం హిట్ కొట్టడానికి కూడా చాల సమయమే పట్టింది. ప్రభాస్ (Prabahs) కూడా అంతే..రాజమౌళి తో ఛత్రపతి చేసాడు..ఆ తర్వాత వరుస ప్లాప్స్ అందుకున్నాడు. రవితేజ (Raviteja) , సునీల్ (Sunil) , నాని (Nani) ఇలా అందరు కూడా రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేకపోయారు.

ఇప్పుడు దేవర (Devara) పరిస్థితి కూడా అదే అని సినీ జనాలు అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ళ పాటు గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ దేవర సినిమా పూర్తి చేసాడు. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్ చూసి రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ కు కూడా మరోసారి వర్తించిందని మాట్లాడుకున్నారు. కానీ ఆ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేసాడని రెండో రోజుతోనే అర్థమైంది. టాక్ తో సంబంధం లేకుండా దేవర బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు కావొస్తున్నా ఇంకా హౌస్ ఫుల్ తో ఆడుతుంది.

కాగా డైరెక్టర్ రాజమౌళితో హిట్ కొట్టిన హీరో తర్వాతి మూవీ సక్సెస్ కాదనే ప్రచారంపై Jr.NTR తనదైన స్టైల్లో స్పందించారు. ‘మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక.. రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి పోయిందని ఆయన మీద తోసేశాం. మనకు చేతకాక క్రియేట్ చేసుకున్న ఒక మిథ్. అది రియాలిటీలో లేకపోయినా మిథ్ బ్రేకర్ అనేది నాకు నచ్చింది అంటూ ఎన్టీఆర్ నవ్వుతూ సమాధానము ఇచ్చారు.

 

Read Also :  Japan-Bound Flight : విమానంలో అడల్ట్ మూవీ.. సిగ్గుతో తలదించుకున్న ప్రయాణికులు