NTR – Shouryuv : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర(Devara) సినిమాతో బిజీగా ఉన్నాడు. RRR తర్వాత చాలా గ్యాప్ తో రాబోయే సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ చేతిలో కూడా చాలానే సినిమాలు ఉన్నాయి. దేవర తర్వాత బాలీవుడ్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2 సినిమా, త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉన్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ మరో డైరెక్టర్ కి ఓకే చెప్పాడని సమాచారం.
ఇటీవల నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఫాదర్ డాటర్ ఎమోషనల్ స్టోరీతో పాటు మంచి లవ్ స్టోరీ కూడా చూపించారు ఈ సినిమాలో. ఈ సినిమా దర్శకుడు శౌర్యువ్ కి ఇదే మొదటి సినిమా. ఈ సినిమా హిట్ అవ్వడంతో తన కెరీర్ కి మంచి ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇటీవల శౌర్యువ్ ఎన్టీఆర్ కి కథ చెప్పాడని, ఎన్టీఆర్ ఓకే చేసాడని సమాచారం. అయితే ఎన్టీఆర్ చేతిలో ఉన్న కమిట్మెంట్స్ అయ్యాకే ఎన్టీఆర్ – శౌర్యువ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. నానితో ఎమోషనల్ స్టోరీ చూపించిన శౌర్యువ్ ఎన్టీఆర్ ని ఏ స్టోరీలో చూపిస్తాడో, ఇది ఎప్పటికి అవుతుందో చూడాలి. ఇక నాని చాలా మంది కొత్త డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్లంతా ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ అవుతున్నారు. శౌర్యువ్ కూడా ఎన్టీఆర్ తో సినిమా తీసి స్టార్ డైరెక్టర్ అవుతాడని అభిమానులు అంటున్నారు.
Also Read : Mahesh Babu : వెకేషన్ నుంచి తిరిగొచ్చిన మహేష్.. గడ్డంతో లుక్ అదిరిందిగా..