దేవర తమిళ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ (NTR) తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో సినిమా చేయాలని ఉందని దాన్ని డైరెక్ట్ తమిళ్ లో చేసి తెలుగులో డబ్ చేస్తానని అన్నారు. వెట్రిమారన్ కూడా అంతకుముందు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ డైరెక్ట్ గా దర్శకుడికి రిక్వెస్ట్ చేశాడు.
తమిళ దర్శకుల్లో వెట్రిమారన్ (Vetrimaran) స్పెషాలిటీ ఏంటో అందరికీ తెలిసిందే. అలాంటి డైరెక్టర్ తో స్టార్ హీరోలు కూడా నటించాలని ఆసక్తి చూపిస్తారు. ఆ లిస్ట్ లో తారక్ కూడా చేరిపోయాడు. ఎన్టీఆర్ స్వయంగా వెట్రిమారన్ సార్ తో సినిమా చేయాలని ఉందని చెప్పడం కోలీవుడ్ ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇచ్చింది.
దేవర సినిమాను కొరటాల శివ..
దేవర సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశారు. జాన్వి కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించారు. దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. దేవర 1 సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. రిలీజ్ కు ముందే బుకింగ్స్ తో ఎన్ టీ ఆర్ స్టామినా ఏంటో దేవర ప్రూవ్ చేస్తుంది.
దేవర సినిమా విషయంలో తారక్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా ట్రైలర్ కాస్త నిరాశ పరచినా కొన్ని సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెడతాయని అంటున్నారు. దేవర 1 ఎలా ఉంటుందో చూడాలంటే మరో 9 రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : Devara Pre Release Event: దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్..!