Site icon HashtagU Telugu

NTR – ANR : తనతో కలిసి నటించడానికి ఏఎన్నార్ ఒప్పుకోవడం లేదని.. ముఖ్యమంత్రితో చెప్పించిన ఎన్టీఆర్..

NTR Requested ANR for acting in His Movie and ANR Requested by CM also for NTR Movie

NTR Requested ANR for acting in His Movie and ANR Requested by CM also for NTR Movie

తెలుగు దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao), నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) కాంబినేషన్ లో అనేక సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం చర్చలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఆ కోవకి చెందిందే.. ‘దాన వీర శూర కర్ణ'(Daana Veera Shura Karna). ఈ సినిమాలో ఎన్టీఆర్(NTR).. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు పాత్రల్లో త్రిపాత్రాభినయం చేసి అదరహో అనిపించారు. అయితే ఈ పాత్రల్లో ఒక పాత్రని ఏఎన్నార్(ANR) చేయాల్సింది. ఇక దీని వెనుక ఒక పెద్ద కథే జరిగింది.

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలి అనుకున్న ఈ సినిమాలో.. ఏఎన్నార్ తో శ్రీకృష్ణుడు లేదా కర్ణుడి పాత్రని వేయించాలని రామారావు భావించారు. ఈ విషయాన్ని నాగేశ్వరరావుకి కూడా తెలియజేశారు. అయితే ఆయన మాత్రం సున్నితంగా తిరస్కరించారు. ఎన్టీఆర్ ని శ్రీకృష్ణుడిగా చూసిన ఆడియన్స్ కి ఏఎన్నార్ ని ఆ పాత్రలో చూడలేరు అని చెప్పుకొచ్చారట. ఇక తాను కర్ణుడి పాత్రని పోషిస్తే.. పాండవులంతా మరగుజ్జులుగా కనిపించాల్సి వస్తుందని చెప్పి ఆ పాత్రకి కూడా నో చెప్పారు. ఎన్టీఆర్ ఎంత చెప్పినా అక్కినేని మాత్రం ఒప్పుకోవడం లేదు.

రామారావు కూడా వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎవరికో ఒకరికి చెప్పి ఏఎన్నార్ ని ఒప్పించేలా ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు నుంచి ఏఎన్నార్ కి ఒకసారి పిలుపు వచ్చింది. అక్కినేని ఆయన దగ్గరికి వెళ్లగా, వెంగళరావు.. “మీ ఇద్దరు కలిసి నటిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఒప్పుకోండి” అంటూ అడిగారట. అయినాసరే ఏఎన్నార్ ఒప్పుకోలేదు. వారి మాటలను కాదనడం కష్టం గానే ఉన్నా.. అదే కరెక్ట్ నిర్ణయమని అక్కినేని నమ్మారట. నిజానికి అక్కినేని నిర్ణయమే కరెక్ట్ అని చెప్పొచ్చు. ఆ సినిమాలో ఎన్టీఆర్.. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడిగా విశ్వరూపం చూపించారు.

 

Also Read : Heroines : ఒకప్పటి హీరోయిన్స్.. వీళ్ళ అసలు పేర్లు ఏంటో తెలుసా..?