NTR request to Anchor : ‘దేవర..’దేవర ‘..’దేవర’ ఇప్పుడు ఎక్కడ చూసిన..ఎక్కడ విన్న ఈ పేరే వినిపిస్తుంది. ఎన్టీఆర్ – కొరటాల శివ (NTR-Koratala Shiva) కలయికలో పాన్ ఇండియా గా తెరకెక్కిన ఈ మూవీ (Devara) తాలూకా ఫస్ట్ పార్ట్ ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచగా..ఇక ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమా ఫై పాన్ ఇండియా లెవల్లో ఆసక్తి పెరిగిపోతుంది.
మంగళవారం చెన్నైలో ‘దేవర’ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న యంగ్ టైగర్..అక్కడి యాంకర్ కు రిక్వెస్ట్ చేయడం అందర్నీ నవ్వుల్లో ముంచేసింది. ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఒకసారి తినడం మొదలు పెడితే ఇక ఆపడాలు ఉండవని పలుమార్లు ఆయన సన్నిహితులు తెలిపారు. భోజనంలో నాటుకోడి కీమా , చికెన్ బిర్యానీ ఎన్టీఆర్ ఇష్టంగా తింటాడని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే తెలిపాడు. తాజాగా దేవర ప్రెస్ మీట్ లో అదే విషయాన్నీ తెలిపారు. నిన్న చెన్నై లో దేవర ప్రమోషన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొరటాల , ఎన్టీఆర్ , జాన్వీ తదితరులు పాల్గొన్నారు. అక్కడ యాంకర్ గ్యాప్ లేకుండా ప్రశ్నలు అడుగుతుండటంతో ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేసారు. ప్రెస్ మీట్ లో యంగ్ టైగర్ మాట్లాడుతూ.. ” మీరు నేను అనుకున్న ప్లాన్ ని మొత్తం నాశనం చేస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ (Dindigul Thalappakatti Biriyani) ప్యాక్ తీసుకుని వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ లేట్ అయితే దాని కోసం నేను పరిగెత్తాలి..మళ్ళీ అది మిస్ అయిపోద్దేమో.. దేవర మూవీ విడుదలైన తర్వాత ఇక్కడికి వచ్చాక మన ఇద్దరం వెళ్లి తిందాం అంటూ” యాంకర్ తో సరదాగా మాట్లాడారు. అంటే తమిళనాడులో యంగ్ టైగర్ కి నచ్చే బిర్యానీ ఇదే అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఇదే సందర్బంగా ఎన్టీఆర్.. ‘అసురన్’ దర్శకుడు వెట్రిమారన్ తాను అభిమానించే వారిలో ఒకరని .. ఆయన ఓకే అంటే నేరుగా తమిళంలో సినిమా చేసేందుకు నేను రెడీ అని అందరి ముందు తెలిపాడు. అవసరమైతే తెలుగులో డబ్బింగ్ చేద్దామన్నారు. అలాగే తాము టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్, సాండల్ వుడ్ ఇలా వేర్వేరు భాషల్లో నటిస్తున్నా అందరిని ఏకం చేసేది ఎప్పటికీ సినిమానే అని ఎన్టీఆర్ చెప్పారు. బాక్సాఫీస్ వద్ద సినిమా సత్తా చాటితే భాష సరిహద్దులు చెరిగిపోతాయన్నారు. తెలుగు సినిమాకు చెన్నై సోపానం వంటిదని పేర్కొన్నారు.
Read Also : Prakasam Barrage : హమ్మయ్య..బొట్లు బయటకు వస్తున్నాయి