NTR యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో వార్ 2 సినిమా లో కూడా భాగం అవుతున్నాడు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ నువ్వా నేనా అన్నట్టుగా వార్ 2 లో ఇద్దరు స్టార్స్ పోటీ పడి నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించనున్నారు. కె.జి.ఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రశాంత్ నీల్ క్రేజ్ పెరిగింది.
సలార్ 1 తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఎన్టీఆర్ తో చేసే సినిమా కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమాకు ఆగష్టు 9న ముహూర్తం పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మాస్ ఆడియన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఈ కాంబోలో మాస్ ట్రీట్ అందించే సినిమా వస్తుందని ఆశిస్తున్నారు.
Also Read : Nani : నాని సినిమాకు ఈ రన్ టైం సరిపోదా..?
ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండగా ఆ సినిమా రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు. ఎన్టీఆర్ దేవర కూడా రెండు భాగాలుగా వస్తుంది. దేవర 1 ఈ ఇయర్ వస్తుండగా దేవర 2 2026 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేసేలా చూస్తున్నారు.
దేవర రెండు భాగాలు, వార్ 2 ఇంకా ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు వరుస సినిమాలతో ఫీస్ట్ అందించనున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడా అని ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. రాబోతున్న సినిమాలతో ఎన్ టీ ఆర్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ఆడియన్స్ ని కూడా మెప్పించేలా చూస్తున్నాడు.