Site icon HashtagU Telugu

NTR Prabhas : ఎన్టీఆర్ ప్రభాస్ మధ్యలో యష్..!

Ntr Prabhas In Between Yash

Ntr Prabhas In Between Yash

NTR Prabhas కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్లు కొడుతున్నాడు. యష్ హీరోగా కేజిఎఫ్ పార్ట్ 1, 2 సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్న ప్రశాంత్ నీల్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ప్రభాస్ తో తీసిన సలార్ పార్ట్ 1 తో కూడా మరో సూపర్ హిట్ కొట్టాడు. ప్రశాంత్ నీల్ సినిమా అంటే చాలు బాక్సాఫీస్ దూకుడు మొదలైనట్టే లెక్క. సలార్ 1 తర్వాత అసలైతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. అయితే సలార్ 2 ని ముందు ఫినిష్ చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నారు.

కానీ అందుతున్న సమాచారం మేరకు ప్రశాంత్ నీల్ ప్లాన్ మార్చినట్టు తెలుస్తుంది. KGF 1, 2 సినిమా తర్వాత కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ KGF 3 సినిమానే ముందు చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మొన్నటిదాకా KGF 3 గురించి అసలు ఏమాత్రం డిస్కషన్ లోకి తీసుకురాని ప్రశాంత్ నీల్ ఇప్పుడు ముందు KGF 3 పూర్తి చేశాకే తర్వాత సినిమాలు అంటున్నాడు.

KGF 3 తర్వాత ఎన్టీఆర్ సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న దేవర, వార్ 2 సినిమాలు పూర్తి చేస్తే ప్రశాంత్ నీల్ సినిమా షురూ చేయనున్నారు. సో యష్ తో KGF 3 ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేశాకే సలార్ 2 ఉంటుందని సినీ వర్గాల సమాచారం. సో అలా అయితే సలార్ 2 కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఏమో కానీ ఈ న్యూస్ నిజమైతే రెబల్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది.

Also Read : Raviteja Eagle : ఈగల్ లేటెస్ట్ కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసిన మాస్ రాజా..!