సంధ్య థియేటర్ (Sandhya Theater) ఘటనకు సంబంధించి మృతి కేసులో అరెస్టయిన అల్లు అర్జున్ (Allu Arjun)కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నిన్నంతా జైలు ఉన్న ఆయన ఈరోజు ఉదయం జైలు నుండి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కలుస్తూ మద్దతు తెలుపుతూ వచ్చారు. డైరెక్టర్లు , నిర్మాతలు , హీరోలు ఇలా చాలామంది బన్నీ ఇంటికి చేరుకొని మద్దతు తెలిపారు. అలాగే అందుబాటులో లేని సినీ ప్రముఖులు సైతం ఫోన్లలో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి అరెస్ట్ విషయమై మాట్లాడినట్లు సమాచారం. ఎన్టీఆర్ (NTR) మరియు అల్లు అర్జున్ చిన్ననాటి నుండి మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు కూడా ‘బావ’ అంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ తమ అనుబంధాన్ని చాటుకుంటుటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలో హిందీ చిత్రం వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ పరిస్థితిని అడిగి తెలుసుకోవడం అతని స్నేహానికి నిదర్శనం. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అవుతోంది. అటు అర్జున్ కూడా ఎన్టీఆర్ ఫోన్ కాల్‌కు స్పందిస్తూ తన కృతజ్ఞతలు తెలిపారు.
Read Also : Viral : భార్యతో అదిరిపోయే స్టెప్పులేసిన రాజమౌళి