Site icon HashtagU Telugu

NTR : హృతిక్, రణ్‌బీర్‌తో ఎన్టీఆర్ పార్టీలు.. వీడియో వైరల్..

Ntr Hrithik Roshan Ranbir Kapoor Alia Bhatt Party Video Viral

Ntr Hrithik Roshan Ranbir Kapoor Alia Bhatt Party Video Viral

NTR : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్.. తన పాత్రకి సంబంధించిన సీన్స్ పూర్తి చేసే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇలా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూనే బాలీవుడ్ పార్టీల్లో కూడా కనిపిస్తూ ముంబైలో సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

నిన్న రాత్రి ముంబైలోని బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీ జరిగింది. ఇక ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్.. ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. వీరందరితో పాటు ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతితో కలిసి డిన్నర్ పార్టీలో సందడి చేసారు. రణ్‌బీర్, అలియా జంటతో కలిసి ఎన్టీఆర్ జంట ఒకే కారులో రావడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు.

ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా నటిస్తున్నారు. హృతిక్ మెయిన్ లీడ్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక చిన్న పాత్ర మాత్రమే చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ చేసే పాత్రకి.. ఈ సినిమా ఒక ఇంట్రడక్షన్ ప్రోమో లాంటింది. ఆ తరువాత ఎన్టీఆర్ పాత్రతో ఒక ఫుల్ మూవీ చేయనున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ ఆల్రెడీ సైన్ కూడా చేసేసారు. కాగా వార్ 2 చిత్రాన్ని ఆయన ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.

జాన్ అబ్రహం ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టులో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను మేకర్స్ ఎలా అందుకుంటారో చూడాలి.

Also read : Samantha : హమ్మయ్య మళ్ళీ సినిమాలు మొదలుపెట్టిన సమంత.. బర్త్ డే రోజు రీ ఎంట్రీ సినిమా అనౌన్స్..