Site icon HashtagU Telugu

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా అభిమానులు.. హోటల్ అద్దాలు పగలగొట్టి.. చేతులెత్తేసిన హోటల్ సిబ్బంది..

NTR Fans Destroying Novatel Hotel at Devara Pre Release Event

Ntr Fans

Devara Pre Release Event : నేడు ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవాటెల్ లో జరుగుతుందని ప్రకటించారు. దీంతో ఎక్కడెక్కడ్నుంచో చాలా మంది ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే నోవాటెల్ లో క్లోజ్ ఆడిటోరియం లో ఈవెంట్ ఏర్పాటు చేసారు. అందులో దగ్గర దగ్గర కూర్చున్నా 2000 మంది కంటే ఎక్కువ పట్టారు. కానీ ఈవెంట్ కి దాదాపు 5000 మంది పైగా వచ్చినట్టు సమాచారం.

పోలీసులు, హోటల్ సిబ్బంది నోవాటెల్ హోటల్ బయటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆపేసినా ఫ్యాన్స్ తోసుకుంటూ మరీ లోపలికి వెళ్లిపోయారు. సరిపోయే జనాల కంటే ఎక్కువ పాస్ లు ఇవ్వడం, పాస్ లు లేని వాళ్ళు కూడా వచ్చేయడంతో నోవాటెల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోసుకుంటూ వెళ్లిపోవడంతో నోవాటెల్ హోటల్ ఎంట్రీ వద్ద అద్దాలు పగలగొట్టేసారు. హోటల్ ప్రాపర్టీకి డ్యామేజ్ చేసారు.

ఇక కొంతమంది ఫ్యాన్స్ పోలీసులతో గొడవ పెట్టుకోవడంతో వారిపై లాఠీ ఛార్జ్ కూడా చేసారు. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేక హోటల్ సిబ్బంది చేతులెత్తేశారు. బాడీగార్డులు కూడా ఫ్యాన్స్ ని తోసేసతున్నారు. కొంతమందిని కిందే కూర్చోపెట్టారు. దీంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా లేదా? ఇంత జనాల్లో సెలబ్రిటీలు వస్తారా రారా అని చర్చ జరుగుతుంది.

 

Also Read : Chiranjeevi Guinness Record : మెగాస్టార్​ ఖాతాలో మరో రికార్డ్