Site icon HashtagU Telugu

NTR : సుమ ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేసిన ఎన్టీఆర్..

Ntr Devara Sm

Ntr Devara Sm

దేవర సక్సెస్ (Devara Success) తో ఎన్టీఆర్ (NTR) ఫుల్ జోష్ లో ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ..ఆ టాక్ కలెక్షన్లను ఏమాత్రం ఆపలేకపోయింది. డే 1 నుండి ఈరోజు వరకు కూడా విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తుంది. దీంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ , శివ వరుస సక్సెస్ ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమా విశేషాలతో పర్సనల్ విషయాలను కూడా ఎన్టీఆర్ షేర్ చేస్తూ వస్తున్నాడు.

సినిమాలు చూసేటప్పుడు బోలెడు క్యాలుక్లేషన్స్ పెట్టుకుంటున్నామని , మూవీ చూడగానే బాలేదు అనేయడం తెలియకుండా జనాలకు అలవాటు అయిపోయిందని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఇలా కొన్ని విషయాల్లో లైఫ్ చాలా నెగటివ్ అయిపోయామని, సినిమాలు చూసే సమయంలో ఇన్నోసెంట్ గా ఉండలేక పోతున్నామని, ప్రతి విషయాన్ని పోల్చుతూ జడ్జ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే అభిమానుల‌ నుంచి తాను పొందుతున్న అభిమానానికి, ప్రేమకు వచ్చే జన్మలో ఋణం తీర్చుకుంటానని.. ఈ జన్మలో తాను తీరుస్తున్నది వ‌డ్డీ మాత్రమేనని హత్తుకునే మాటలతో ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ ఆనందపరిచారు.

ప్రతి సినిమాలాగే ఈ చిత్రానికి కూడా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయాలని ప్లాన్‌ చేశాం. అభిమానులు నన్ను చూడటం కన్నా నేను వాళ్లను చూడటం చాలా ముఖ్యమనే ఉద్దేశంతోనే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చేయాలనుకున్నాం. ఎందుకంటే ‘దేవర’ గురించి వాళ్లతో చాలా విషయాలు పంచుకోవాలనుకున్నా. అది రద్దు అయింది. సినిమా సక్సెస్‌ను అభిమానులతో పంచుకోవడానికైనా ఈవెంట్‌ పెడదామంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు సందర్భంగా అవుట్‌డోర్‌ వేడుకలకు అనుమతి లభించలేదు. నా ఫ్యాన్స్‌ 24 ఏళ్లుగా నన్ను మోస్తున్నారు. ‘దేవర’పై మీరు చూపిన ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో. కానీ, ఒక విషయమైతే చెబుతా.. మీరు కాలర్‌ ఎగరేసుకునేలా చేయడమే నా బాధ్యత. ఈ సినిమాను ఆదరించి కొత్త ఊపిరి పోసినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను’’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Read Also : Bath: స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే!