Krishna : ఎన్టీఆర్ నుంచి కృష్ణకు చేరిన కథ.. కట్ చేస్తే చరిత్ర సృష్టించింది.. ఆ సినిమా ఏంటో తెలుసా?

డేరింగ్ అండ్ డాషింగ్ తో ముందుకు వెళ్తూ చేసిన సినిమా 'అల్లూరి సీతారామరాజు'. 1974లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించింది.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 09:00 PM IST

సూపర్ స్టార్ కృష్ణ(Krishna)ని అందరూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని పిలుస్తారు. ఎందుకంటే సినిమాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు అలాంటివి. ఆయన చేసిన ప్రయోగాలతో తెలుగు తెర ఎన్నో కొత్త హంగులను అద్దుకుంది. ఫస్ట్ సినిమా స్కోప్ సినిమా – అల్లూరి సీతారామరాజు, ఫస్ట్ ఈస్ట్ మాన్ కలర్ సినిమా – ఈనాడు, ఫస్ట్ 70MM సినిమా – సింహాసనం, ఫస్ట్ DTS సినిమా – తెలుగువీర లేవరా, ఫస్ట్ కౌ బాయ్ సినిమా – మోసగాళ్లకు మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా – గూఢచారి 116.. ఇలా ఎంతో కొత్తదనాన్ని పరిచయం చేశారు.

ఇక ఇదే ధైర్యంతో ఇండస్ట్రీలో ఎంతో మంది వద్దు అంటున్నా వినకుండా డేరింగ్ అండ్ డాషింగ్ తో ముందుకు వెళ్తూ చేసిన సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. 1974లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించింది. అయితే ఈ కథలో సీనియర్ ఎన్టీఆర్ నటించాలని దగ్గర ఉండి తానే రచయితల చేత సిద్ధం చేయించుకున్నారు. ఈ సినిమాని అనౌన్స్ చేసి కొన్ని రోజులు కూడా షూటింగ్ చేశారు ఎన్టీఆర్. కానీ ఆ మూవీ అనేక కారణాలు వల్ల ఆగిపోయింది. ఒకసారి, రెండు సార్లు కాదు దాదాపు 6 సార్లు ఈ సినిమాని అనౌన్స్ చేయడం, ఆపేయడం జరిగింది.

కొన్నేళ్ల తరువాత ఎన్టీఆర్ నుంచి ఈ స్క్రిప్ట్ శోభన బాబు దగ్గరకి కూడా వెళ్ళింది. అయితే అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. చివరిగా ఆ స్క్రిప్ట్ కృష్ణ గారి దగ్గరకి వెళ్ళింది. అల్లూరి సీతారామరాజు పాత్ర ఆయనకి బాగా నచ్చేసింది. దీంతో ఆయన మైల్ స్టోన్ మూవీ 100వ చిత్రంగా అల్లూరి సీతారామరాజుని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో కృష్ణ యాక్టింగ్ చూసిన ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుని మళ్ళీ ఎప్పటికైనా తాను తీద్దాం అనుకున్న ఆలోచనని పూర్తిగా విరమించుకున్నారట. అందుకనే మనకి కూడా ఇప్పటికి అల్లూరి సీతారామరాజు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కృష్ణనే.

 

Also Read :  Krishna – Mahesh : కృష్ణ మహేశ్ బాబు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?