Site icon HashtagU Telugu

NTR Devara : దేవర ఏమాత్రం తేడా వచ్చినా సరే..!

Is NTR Triple Role in Devara

Is NTR Triple Role in Devara

NTR Devara ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబోని రిపీట్ చేస్తూ ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో సంచలనానికి సిద్ధమయ్యారు. దేవర 1 సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా విషయంలో ఎన్.టి.ఆర్ కేవలం ఒక హీరోగానే కాకుండా అన్ని విధాలుగా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాడట. ఎలాగైనా దేవర తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఐతే దేవర ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. పాన్ ఇండియా రిలీజ్ అంటే కేవలం హీరో ఎలివేషన్స్ ఉంటే సరిపోదు అందుకు తగిన కథ కథనాలు ఉండాలి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే వాటిని అందుకోవడంలో దేవర టీం సక్సెస్ అవ్వాలి. అసలే పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఒకదాన్ని మించి మరోటి అనేలా సినిమాలు వస్తున్నాయి.

కల్కి చూసిన పాన్ ఇండియా ఆడియన్స్ అంతకుమించి అనిపించే కంటెంట్ ని కావాలని అనుకుంటారు. సో ఈ టైం లో ఏమాత్రం రెగ్యులర్ రొటీన్ కంటెంట్ తో వచ్చినా రిజల్ట్ వేరేలా ఉంటుంది. అందుకే దేవర విషయంలో తారక్ తేడా రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. సినిమా ఏమాత్రం తేడా వచ్చినా తెలుగు ఆడియన్స్ కాదు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎటాక్ చేసే చాన్స్ ఉంటుంది.

Also Read : Mahesh Rajamouli : మహేష్ రాజమౌళి.. బర్త్ డే నాడైనా ప్లాన్ చేస్తారా..?