NTR Devara: ఎన్టీఆర్ దేవర షూటింగ్ ఎంత వరకు వచ్చింది?

నందమూరి ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దేవర పోస్ట్ పోన్ అని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.

Published By: HashtagU Telugu Desk
NTR Devara

NTR Devara

NTR Devara: నందమూరి ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దేవర పోస్ట్ పోన్ అని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. తాజా వార్త ఏంటంటే.. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ 10 నుంచి 15 రోజులు ఉంటుంది. ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. మూడు డ్యూయోట్స్ ఉన్నాయి. ఒక సోలో సాంగ్ ఉంది. మొత్తం నాలుగు పాటలను చిత్రీకరించనున్నారు.

ఈ నాలుగు పాటలు షూట్ కంప్లీట్ అయితే చాలా వరకు సినిమా అయినట్టే. ఆ తర్వాత గ్రాఫిక్స్ పై కాన్ సన్ ట్రేషన్ చేస్తారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. నిర్మాణపరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఆలస్యం అయినా ఫరవాలేదు కానీ.. క్వాలిటీ విషయంలో మాత్రం తగ్గే ప్రసక్తేలేదంటున్నారు. ఇక ఎన్టీఆర్ పాత్రల విషయానికి వస్తే.. త్రిబుల్ రోల్ అంటూ వార్తలు వచ్చాయి కానీ.. అందులో ఎలాంటి వాస్తవం లేదని.. ఇందులో డబుల్ రోల్ మాత్రమే చేస్తున్నాడని తెలిసింది.

కథ విషయంలో మాత్రం ఎలాంటి లీకులు రాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేవర అసలు కథ ఏంటి అనేది ఎక్కడా బయటకు రాలేదు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అనేది బయటకు వచ్చింది కానీ.. అసలు పాయింట్ ఏమిటి అనేది లీక్ చేయలేదు. కొరటాల సినిమా అంటే.. అందులో మంచి సందేశం ఉంటుంది. ఇందులో కూడా మంచి సందేశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి.. దేవర బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సందడి చేస్తాడో..? ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.

Also Read: AP Special Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే: ఏపీ బీజేపీ

  Last Updated: 05 Mar 2024, 10:52 PM IST