NTR Devara ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ అనుకున్నారు. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన టీజర్ అంచనాలు పెంచగా కచ్చితంగా దేవర ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలరిస్తుందని అంటున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఇక సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుండగా లేటెస్ట్ గా సినిమా నుంచి వచ్చిన ఒక స్పెషల్ అప్డేట్ మరింత క్రేజీగా ఉంది. సినిమాలో ఇంటర్వల్ సీన్ కొరటాల నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశాడట. ఇక సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ నటన ప్రతి అభిమాని గర్వపడేలా ఉంటుందని అంటున్నారు.
సినిమాలో తారక్ పాత్ర చాలా వేరియేషన్స్ ఉంటాయట. అందుకే వాటికి తగినట్టుగా ఎన్టీఆర్ వర్సటైల్ యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు.
ఎన్టీఆర్ దేవర మొదటి పార్ట్ ఎండింగ్ కూడా భారీగా ఉంటుందట. సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూసేలా సినిమా క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. దేవర సినిమాలో జాన్వి కపూర్ పాత్రకు కూడా వెయిట్ ఉంటుందని తెలుస్తుంది. దేవర ఏప్రిల్ 5న రావడం కష్టమని తెలుస్తుండగా సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం చిత్ర యూనిట్ ఇంకా వెల్లడించలేదు.
Also Read : Mrunal Thakur : వాళ్లపై ఘాటు కామెంట్స్ ఈ వీడియో వైరల్ అవుతుందని చెప్పి మరి షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..!