NTR Devara : దేవర ముందుకొచ్చింది.. కన్ ఫ్యూజన్ మొదలైంది..!

NTR Devara స్టార్ సినిమాల రిలీజ్ కన్ ఫ్యూజన్ మళ్లీ మొదలైంది. అసలే ఈ ఇయర్ సమ్మర్ స్టార్ సినిమాలు లేక వెలితిగా అనిపించగా రాబోతున్న రిలీజ్ ల విషయంలో

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 12:35 PM IST

NTR Devara స్టార్ సినిమాల రిలీజ్ కన్ ఫ్యూజన్ మళ్లీ మొదలైంది. అసలే ఈ ఇయర్ సమ్మర్ స్టార్ సినిమాలు లేక వెలితిగా అనిపించగా రాబోతున్న రిలీజ్ ల విషయంలో కూడా కొన్ని అటు ఇటు అవుతున్నాయని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. జూన్ 27న కల్కి రిలీజ్ పక్కా అవుతుంది. మే నుంచి జూన్ కి వాయిదా పడిన కల్కి దాని ప్రకారంగా ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఆగష్టు 15న అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ లాక్ చేశారు.

ఐతే అనుకున్న టైం కు పుష్ప 2 వస్తుందన్న గ్యారెంటీ చెప్పలేకపోతున్నారు మేకర్స్. సినిమా ఇంకాస్త షూట్ చేయాల్సి ఉందట. సుకుమారేమో నన్ను తొందర పెట్టొద్దు ప్లీజ్ అంటున్నాడు. ఓ పక్క రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది. మరి పుష్ప 2 ఆగష్టు 15న రాకపోతే డిసెంబర్ దాకా రిలీజ్ ఛాన్స్ లేదన్నట్టే.

Also Read : Nitya Menon : నిత్యా మీనన్ ని ప్రోత్సహిస్తున్న హీరో.. ఎంతైనా హిట్ కాంబో కదా మరి..!

ఇక ఏప్రిల్ 5న రిలీజ్ అనుకున్న ఎన్.టి.ఆర్ దేవర కాస్త అక్టోబర్ 10న రిలీజ్ అన్నారు. దసరాకి తారక్ హంగామా ఉంటుందని అనుకోగా సినిమా వాయిదా పడటం కాదు ప్రీ పోన్ చేసి సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ అంటున్నారు.

దేవర ముందుకొచ్చి చాలా కన్ ఫ్యూజ్ చేసింది. దేవర సెప్టెంబర్ 27న వస్తే ఆ రోజు రావాల్సిన పవన్ ఓజీ పరిస్థితి ఏంటి..? అక్టోబర్ 10న ఏ సినిమా వస్తుంది అనే కన్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 10న రాం చరణ్ గేం చేంజర్ వస్తుందని టాక్. పుష్ప 2 ఆగష్టు నుంచి వాయిదా పడితే డిసెంబర్ సెకండ్ వీక్ రిలీజ్ ప్లాన్ చేస్తారట.

ఐతే డిసెంబర్ లో నితిన్ రాబిన్ హుడ్, చైతన్య తండేల్ లు క్రిస్ మస్ టార్గెట్ తో వస్తున్నారు. మరి ఈ సినిమాల రిలీజ్ లు మారుతాయో లేదో చూడాలి. మొత్తానికి స్టార్ సినిమాల రిలీజ్ ల వల్ల మొత్తం రిలీజ్ షెడ్యూల్ మారిపోయేలా ఉందని చెప్పొచ్చు.