Site icon HashtagU Telugu

Devara : దేవర మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..? హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి?

NTR Devara Movie World Wide Three Days Collections

Devara

Devara Collections : ఎన్టీఆర్(NTR) దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ ని మాత్రం ఎన్టీఆర్ మెప్పించాడు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంచడం, టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోలతో బాగా కలిసి వచ్చింది దేవర సినిమాకు. దీంతో మొదటి రోజు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. దేవర మొదటి రోజు ఏకంగా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

అయితే రెండో రోజు నుంచి మాత్రం కలెక్షన్స్ పడిపోయాయి. దేవర సినిమా రెండో రోజు 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక నిన్న ఆదివారం మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా 61 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది దేవర సినిమా. మొత్తంగా మూడు రోజుల్లో దేవర సినిమా 304 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమా టాక్ ఎలా ఉన్నా వీకెండ్ కావడంతో ఈ మూడు రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చాయి.

దేవర సినిమాకు 180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 360 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇక సినిమా హిట్ టాక్ అంటే కనీసం 400 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. మరో రెండు లేదా మూడు రోజుల్లో దేవర మొత్తంగా 400 కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందని బాక్సాఫీస్ సమాచారం. అయితే దేవర 500 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలో దిగింది. త్వరలో దసరా హాలిడేస్ కూడా వస్తుండటంతో మరో వారం రోజుల్లో దేవర 500 కోట్ల మార్కును చేరుకుంటుందని భావిస్తున్నారు.

 

Also Read : Game Changer Song : గేమ్ ఛేంజర్ రెండో సాంగ్ వచ్చేసింది.. రా మచ్చా అంటూ అదరగొట్టిన చరణ్..