Devara Interval Scene యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది తెలిసేలా చేశారు. ఇక ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచేలా క్రేజీ అప్డేట్స్ ఇస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
లేటెస్ట్ గా సినిమాలో ఇంటర్వెల్ సీన్ గురించి న్యూస్ బయటకు వచ్చింది. దేవర ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. సినిమా హైలెటెడ్ సీన్స్ లో ఇది ఒకటని తెలుస్తుంది.
దేవర ఇంటర్వెల్ లోనే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుందట. సినిమాలో ఎన్.టి.ఆర్ (NTR) డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని ఇంటర్వెల్ లో రెండో పాత్ర రివీల్ అవుతుందని అంటున్నారు. కొరటాల శివ (Koratala Siva) ఈ సీన్స్ ని క్రేజీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ ఎన్.టి.ఆర్ కాంబోలో వస్తున్న దేవర సినిమా పాన్ ఇండియా వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.
సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేయగా ఇప్పుడు అనుకున్న డేట్ కి రిలీజ్ కష్టమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ అవుతుందని చెప్పుకుంటున్నారు.
Also Read : Allu Arjun And Boyapati: సరైనోడు కాంబో రిపీట్
ఎన్.టి.ఆర్ దేవర మొదట ఒక సినిమాగా అనుకున్నా సినిమాలో క్యారెక్టరైజేషన్స్ బాగా వస్తుండటం వల్ల సినిమాను రెండు పార్ట్ లుగా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలి ఖాన్ నటిస్తున్నారు.