Site icon HashtagU Telugu

NTR Devara : దేవరకు సమస్యగా మారిన అతను.. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్..!

Is NTR Triple Role in Devara

Is NTR Triple Role in Devara

NTR Devara యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రాం కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా అనిరుద్ సినిమాను అనుకున్న టైం కు పూర్తి చేయడంలో మాత్రం వెనకపడుతున్నాడు.

దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వకపోవడానికి వి.ఎఫ్.ఎక్స్ వర్క్ మాత్రమే కాదు అనిరుద్ మ్యూజిక్ కూడా మరో కారణమని తెలుస్తుంది. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న అనిరుద్ దేవర సినిమాకు అనుకున్న టైం ఇవ్వలేకపోతున్నాడట. అందుకే మ్యూజిక్ విషయంలో ఈ డిలే జరుగుతుంది. ఈమధ్య వచ్చిన ఒక గ్లింప్స్ కి మాత్రం అనిరుద్ అదరగొట్టగా సినిమాను మ్యూజిక్ విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.

అనిరుద్ వల్ల కూడా దేవర లేట్ అవుతుందని తెలుస్తుంది. దేవర సినిమా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. దసరా బరిలో ముందు అనౌన్స్ చేసిన దేవర సినిమాను పర్ఫెక్ట్ హిట్ టార్గెట్ తో తీసుకు రావాలని చూస్తున్నారు. అనిరుద్ కాస్త కోపరేట్ చేసి సినిమాకు అనుకున్న విధంగా మ్యూజిక్ అందిస్తే బెటర్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Also Read : Tollywood : ఆడియన్స్ లేక షోలు క్యాన్సిల్.. స్టార్ సినిమాకు ఇలాంటి తిప్పలేంటి..?