Site icon HashtagU Telugu

Padma Vibhushan : కంగ్రాట్స్ ‘బాలా బాబాయ్’ అంటూ ఎన్టీఆర్ అభినందనలు

Ntr Congrats To Balakrishna

Ntr Congrats To Balakrishna

Padma Vibhushan 2025 : 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ అవార్డులను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ, ఈ అవార్డులు ప్రకటించబడిన జాబితాలో అనేక గొప్ప వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ అవార్డులు కళలు, సాహిత్యం, వైద్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, క్రీడలు, వాణిజ్యం, పరిశ్రమలు, పౌర సేవ వంటి అనేక రంగాలలోని ప్రముఖులకు ఇచ్చి, వారి విశేష కృషిని గుర్తించనున్నారు.

Padma Awards : పద్మభూషణ్ అందుకున్న తెలుగువారు వీరే..

పద్మవిభూషణ్ అవార్డుకు 7 గురు. 19 మంది వ్యక్తులకు పద్మభూషణ్ అవార్డు మరియు 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇక పద్మవిభూషణ్ అందుకున్న వారిలో గాడ్ ‌ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. బాలకృష్ణ(Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం తో నందమూరి అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఈ ప్రకటన రావడం ఆలస్యం సోషల్ మీడియా లో బాలయ్య పేరు మారుమోగిపోతుంది. సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. వీరిలో జూనియర్ ఎన్టీఆర్(NTR) కూడా ఉన్నారు. ‘పద్మ భూషణ్ పురస్కారం లభించినందుకు కంగ్రాట్స్ బాలా బాబాయ్. సినీ పరిశ్రమకు, ప్రజా సేవకు మీరు చేసిన అసమానమైన సేవలకు నిదర్శనంగా ఈ గుర్తింపు దక్కింది’ అని తారక్ కొనియాడారు. అలాగే సీఎం సీఎం చంద్రబాబు సైతం బాలయ్య ను అభినందించారు. లెజండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయాలు, సేవా రంగాల్లో రాణిస్తున్నారని కితాబిచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా అంకితభావంతో చేసిన సేవ వేల మంది జీవితాలను తాకిందని, లక్షలాది మందికి స్ఫూర్తిని ఇచ్చిందని మెచ్చుకున్నారు. ఇది నిజమైన ఐకాన్, దయగల నాయకుడికి తగిన గౌరవం అని సీఎం పేర్కొన్నారు.

కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి చికిత్స అందిస్తున్నందుకు గాను, అదే విధంగా ఏపీలోని హిందూపూర్ శాసన సభ్యుడిగా మంచి పనులు చేస్తున్నందుకు గాను ఆయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించడం జరిగింది.