Site icon HashtagU Telugu

NTR – Nelson : తమిళ్ స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా.. సక్సెస్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చేసిన ఎన్టీఆర్..

Ntr Comments on Movie with Tamil Direcor Nelson Dileep Kumar

Ntr Nelson

NTR – Nelson : ఎన్టీఆర్ దేవర తో హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దేవర 2 సినిమా ఉండనుంది. అయితే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అది నాగవంశీ నిర్మాణంలో అని అంటున్నారు.

ఇటీవల ఓ ఈవెంట్లో నాగవంశీ మాట్లాడుతూ.. నెల్సన్ తో సినిమా చేస్తున్నాం కానీ హీరో ఎవరో ఇంకా ఫైనల్ చేయలేదు అన్నాడు. నిన్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ జరగ్గా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. త్వరలో నేను వంశీతో సినిమా చేయబోతున్నాను. అది చాలా పెద్ద సినిమా. దాని గురించి ఏం ఉన్నా వంశీ మాట్లాడతాడు అని చెప్పారు.

దీంతో ఎన్టీఆర్ వంశీ నిర్మాణంలో చేయబోయేది నెల్సన్ తోనే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. టాలీవుడ్ లో కూడా అదే వినిపిస్తుంది. నెల్సన్ ఇప్పటికే డాక్టర్, బీస్ట్, జైలర్ సినిమాలతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం జైలర్ 2 చేస్తున్నాడు. ఇది అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ – నెల్సన్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

అలాగే ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ అదుర్స్ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. కామెడీ చేయాలంటే చాలా కష్టం. అందుకే అదుర్స్ 2 చెయ్యట్లేదు. భయపడుతున్నాను మళ్ళీ అంత కామెడీ వస్తుందో లేదో అని అన్నారు.

 

Also Read : NTR : బామ్మర్ది నార్నె నితిన్ పై ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్.. నా పెళ్లి అప్పుడు చిన్న పిల్లాడు.. అస్సలు మాట్లాడేవాడు కాదు..

Exit mobile version