Devara : దేవర స్టోరీ లైన్ ఎలా ఉంటుందో చెప్పిన ఎన్టీఆర్..

దేవర స్టోరీ లైన్ ఎలా ఉంటుందో చెప్పిన ఎన్టీఆర్. దేవర స్టోరీ లైన్ అంతా..

Published By: HashtagU Telugu Desk
Ntr Comments About Devara Story Line At Tillu Square Success Meet

Ntr Comments About Devara Story Line At Tillu Square Success Meet

Devara : కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘దేవర’. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. ఆర్ఆర్ఆర్ వంటి సక్సెస్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న దర్శకనిర్మాతలు. దీంతో ఈ మూవీ షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. అందువలనే ఈ నెలలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అక్టోబర్ కి వాయిదా పడింది.

ఇక మూవీ పోస్టుపోన్ అవ్వడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశపడ్డారు. అయితే వారిని ఉత్సాపరిచేందుకు మూవీ గురించి ఎన్టీఆర్ రీసెంట్ గా ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు.

దేవర స్టోరీ లైన్ అంతా భయం అనే పాయింట్ చుట్టూ తిరుగుతుందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే సినిమాలో చాలా వరకు భయం గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది.. అంటూ స్టోరీ లైన్ ని ఒక మాటలో చెప్పేసారు. ఇక అలాగే ఈ సినిమా పై తన కాన్ఫిడెన్స్ ని తెలియజేస్తూ.. “కొంచెం ఓవర్ గా మాట్లాడుతున్నాను అనుకోకండి. కానీ ఒకటి మాత్రం నిజం. ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయినా, మూవీ మాత్రం మీరు కాలర్ ఎగరేసేలా ఉంటుంది. అందుకోసం మేము చాలా కష్టపడుతున్నాము” అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఇక ఎన్టీఆర్ మాటల్లో కాన్ఫిడెన్స్ చూసిన అభిమానుల్లో సినిమా పై మరింత అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ మూవీ మొదటి భాగాన్ని అక్టోబర్ 10న దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

Also read : Prabhas : అర్జున్ రెడ్డి తరువాత సందీప్ వంగని పిలిచి ఆఫర్ ఇచ్చిన ప్రభాస్.. కానీ దర్శకుడు నో..

  Last Updated: 09 Apr 2024, 10:59 AM IST