నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ విడుదలైన తొలి నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటి లాభాల్లోకి ప్రవేశించింది. మార్చి 28న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతూ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ (MAD Square Success Meet) నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
2025 Prophecies: 2025లో బాబా వంగా చెప్పినట్టే అన్నీ.. ఫ్యూచర్‌లోనూ అవన్నీ
ఈ విజయాన్ని మరింత ఘనంగా జరుపుకోవడానికి మేకర్స్ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా విజయానికి మరింత హైప్ తీసుకురావడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 4న హైదరాబాద్ శిల్పకళావేదికలో ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరవుతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో ‘మ్యాడ్’ ట్రైలర్ లాంచ్ చేసిన తారక్, ఈ సినిమాకు తన బెస్ట్ విషెస్ చెప్పారు. అలాగే నిర్మాత నాగవంశీ, ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటం కూడా ఈ ఊహాగానాలకు బలాన్ని ఇచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.