ANR – NTR : ఏఎన్నార్, ఎన్టీఆర్‌కి కోపం రావడంతో.. కాళ్ళ మీద పడ్డ దర్శకుడు..

తెలుగు దిగ్గజ నటులు ఏఎన్నార్(ANR), ఎన్టీఆర్‌(NTR) కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి. అలా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రాల్లో ఒకటి ‘భూకైలాస్‌’ (Bhookailas).

Published By: HashtagU Telugu Desk
NTR and ANR Fires on Bhookailas Director while shooting time

NTR and ANR Fires on Bhookailas Director while shooting time

తెలుగు దిగ్గజ నటులు ఏఎన్నార్(ANR), ఎన్టీఆర్‌(NTR) కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి. అలా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రాల్లో ఒకటి ‘భూకైలాస్‌’ (Bhookailas). అప్పటి బడా నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్‌(AVM Productions) ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఎస్వీ రంగారావు, జమున కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేశారు.

ఈ సినిమాలోనే ఎన్టీఆర్ తొలిసారి రావణుడి పాత్ర పోషించారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు నారదుడి పాత్రలో కనిపించారు. 1958లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రాన్ని కె శంకర్ డైరెక్ట్ చేశారు. ఎడిటర్ గా కెరీర్ మొదలుపెట్టిన శంకర్ కి ఇది రెండో సినిమా. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఇటు తెలుగులో ఏఎన్నార్, ఎన్టీఆర్‌లతో అటు కన్నడలో ‘రాజకుమార్’, ‘కళ్యాణ్ కుమార్’తో ఒకే సమయంలో తెరకెక్కించారు. ఇలా రెండో సినిమాకే ఇంతమంది అగ్రహీరోలను హ్యాండిల్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి.

మరి ఇలాంటి పెద్ద స్టార్స్ తో ఒకే సమయంలో సినిమా చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయిగా, అలాంటి ఒక సమస్యే దర్శకుడు శంకర్ కి ఎదురైంది. మూవీలో సముద్రం ఒడ్డున సూర్యోదయం సమయంలో చూపించే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరు నటించాలి.ఆ సీన్ చిత్రీకరణ కోసం హీరోలు ఇద్దరు మేకప్ వేసుకొని ఉదయం 5 గంటలు ముందే షూటింగ్ స్పాట్ లో ఉండాలి. ఇక ఇదే విషయాన్ని దర్శకుడు ఏఎన్నార్, ఎన్టీఆర్ కి చెప్పగా వాళ్ళు ఓకే అన్నారు.

ఇక టైం కరెక్ట్ గా పాటించే వీరిద్దరూ ఐదు గంటలకు కన్నా ముందే అక్కడకి వచ్చేశారు. కానీ అక్కడ మూవీ యూనిట్ ఎవరు లేరు. ఉదయం 6 గంటలు అయినా ఎవరు రాలేదు. దీంతో హీరోలు ఇద్దరు తప్పు లొకేషన్ కి వచ్చాము అనుకుంటా అని భావించి వెనక్కి పయనం అయ్యారు. అదే సమయంలో డైరెక్టర్ కారులో నుంచి దిగాడు. దర్శకుడిని చూడగానే ఏఎన్నార్, ఎన్టీఆర్ కోపంతో ఊగిపోయారు. ఇక వారిని చూసిన దర్శకుడు పరిస్థితి అర్థమయి కారు దిగి దిగగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరి కాళ్ళ మీద పడి.. పొరపాటు అయ్యింది. క్షమించండి అంటూ వేడుకున్నాడట. ఇక హీరోలు ఇద్దరు కూడా శాంతపడి చివరికి ఆ బీచ్ సీన్ ని పూర్తి చేశారు.

 

Also Read : Pawan Kalyan Birthday : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. జనసేన చేయబోయే కార్యక్రమాలు ఇవే..

  Last Updated: 01 Sep 2023, 06:30 PM IST