Site icon HashtagU Telugu

NTR – Allu Arjun : ఏడేళ్ల తరువాత ఎన్టీఆర్ రికార్డుని బ్రేక్ చేసిన అల్లు అర్జున్..

Allu Arjun Breaks Seven Years Ntr Record With Pushpa 2 Teaser

Allu Arjun Breaks Seven Years Ntr Record With Pushpa 2 Teaser

NTR – Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ సృష్టించిన సంచలనంతో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాని చూసేందుకు ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఆసక్తితోనే అల్లు అర్జున్ కి కొత్త రికార్డుని ఇచ్చారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ టీజర్ లో అమ్మోరు అవతారంలో అల్లు అర్జున్ కనిపించి ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించారు. దీంతో ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో నిలిచింది. అది కూడా ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా ఐదు రోజులు పైనే కంటిన్యూగా పుష్ప 2 టీజర్ ట్రేండింగ్ లో నిలిచింది. పుష్ప 2 టీజర్ యూట్యూబ్ టాప్ ట్రేండింగ్ లో 138 గంటలు కంటిన్యూగా నిలుస్తూ వచ్చింది. గతంలో ఇలా ఎక్కువసేపు ట్రేండింగ్ లో ఉన్న రికార్డు ఎన్టీఆర్ పేరు మీదన ఉంది. ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ యూట్యూబ్ ట్రేండింగ్ లో ఎక్కువ కాలం నిలిచి రికార్డు సృష్టించింది.

ఏడేళ్ల తరువాత ఆ రికార్డుని అల్లు అర్జున్ పుష్ప 2 టీజర్ తో బ్రేక్ చేసారు. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఒక చిన్న టీజర్ తోనే రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప.. ట్రైలర్ తో కొత్త రికార్డులు సృష్టిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఫస్ట్ పార్ట్ తో సంచలనం సృష్టించిన పుష్ప.. సెకండ్ పార్ట్ తో ఎలాంటి సంచనాలు సృష్టిస్తారో చూడాలి.

Also read : Sai Pallavi : సీతగా నటించేందుకు సాయి పల్లవి.. అన్ని కోట్లు తీసుకుంటుందా..!