జూనియర్ ఎన్టీఆర్ (NTR) బాక్స్ ఆఫీస్ స్టామినా గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నూనుగు మీసాల వయసులోని రికార్డ్స్ క్రియేట్ చేసి అప్పటి బాక్స్ ఆఫీస్ ని ఏలుతున్న చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna)కి గట్టి పోటీ ఇచ్చాడు. 2002లో వి వి వినాయక్ తో ‘ఆది’ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్.. ఆ తరువాత సినిమా మాస్ డైరెక్టర్ బి గోపాల్ (B Gopal) తో చేశాడు. బాలకృష్ణతో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు. చిరంజీవితో ఇంద్ర వంటి సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ చైర్ ని సొంతం చేసుకున్నారు బి గోపాల్.
ఆ సమయంలో ‘ఆది'(AAdi) వంటి సూపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ తో బి గోపాల్ సినిమా ప్రకటించడంతో మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ‘అల్లరి రాముడు'(Allari Ramudu) అనే టైటిల్ ని పెట్టుకున్న ఆ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథని అందించారు. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందిచాడు. ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్ కి జోడిగా నటించింది. నగ్మా, నరేష్, కె విశ్వనాథ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం గాడి తప్పింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ గా మిగిలింది. అయితే కమర్షియల్ గా మాత్రం ఈ మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఈ కాంబినేషన్ పై భారీ హైప్ ఉండడంతో థియేటర్స్ కి ఆడియన్స్ క్యూ కట్టారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిసింది. ఈ చిత్రాన్ని చంటి అడ్డాల నిర్మించారు. దర్శకుడు గోపాల్ ఎప్పుడు కనిపించినా ఈ మూవీ కలెక్షన్స్ గురించి నిర్మాత చంటి ఒక మాట అంటారట.. “లెక్కేసుకుంటే చేతులు నొప్పి పుట్టేంత కలెక్ట్ చేసింది అల్లరి రాముడు” అని. ఈ విషయాన్ని బి.గోపాల్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియచేశారు.
Also Read : Upasana : తల్లి అయ్యాక ఉపాసన ఫస్ట్ బర్త్ డే ను చరణ్ ఎలా జరపబోతున్నాడో తెలుసా..?