యంగ్ టైగర్ NTR ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు సెట్స్ పైకి రాబోతున్న సినిమాలపై అభిమానుల అంచనాలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. రీసెంట్ గా దేవర (Devara) మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు భారీ వసూళ్లు రాబట్టి.. తాజాగా ఓటీటీలో కూడా విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్.. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 (War 2)షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్‌లో తన తొలి ఎంట్రీ కావడం తో ఈ సినిమా పై అంచనాలు అమితంగా ఉన్నాయి. దర్శకుడు కూడా ఎన్టీఆర్ నటనపై మెచ్చి, యాక్టింగ్ విషయంలో ఆయనకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్లో ఓ మైలు రాయి చిత్రంగా నిలుస్తుందని అంత భావిస్తున్నారు.
వార్ 2 తరువాత, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్‌కి దర్శకుడిగా ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కోసం భారీ స్థాయిలో కథను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తారక్ కోసం కొత్తరకం స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాడు. ఇది కాకుండా ఎన్టీఆర్ తన 33వ చిత్రాన్ని తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar)తో చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య కథా విషయాలు దాదాపు పూర్తి అవ్వడంతో, అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థతో పాటు మరో భాగస్వామితో కలిసి నిర్మాణంలోకి రానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా పాన్-ఇండియా స్థాయిలో ప్రాజెక్టులు చేయడంలో బిజీగా ఉండటం చూస్తుంటే, ఆయన భవిష్యత్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అర్థమవుతోంది.
Read Also : KCR : ఆగం కాకండి ప్రజలారా.. మళ్లీ రానున్నది మన ప్రభుత్వమే – కేసీఆర్