NTR 30 : గడ్డం కోసం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆపేశారంట.. ఏకంగా నెల రోజులు..

ఎన్టీఆర్ 30వ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. వెంటనే రెండో షెడ్యూల్ మొదలుపెడతారని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి షూటింగ్ ని నెల రోజులు వాయిదా వేశారట.

Published By: HashtagU Telugu Desk
NTR 30 Shooting postponed for 30 Days

NTR 30 Shooting postponed for 30 Days

RRR సినిమా వచ్చిన సంవత్సరం తర్వాత NTR తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ 30వ(NTR 30) సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు చేసుకొని షూటింగ్ మొదలుపెట్టింది. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో, కళ్యాణ్ రామ్(Kalyan Ram) నిర్మాణంలో ఎన్టీఆర్ 30వ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ప్రకటించారు.

ఎన్టీఆర్ 30వ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. వెంటనే రెండో షెడ్యూల్ మొదలుపెడతారని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి షూటింగ్ ని నెల రోజులు వాయిదా వేశారట. దీంతో ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే షూటింగ్ ఎందుకు వాయిదా వేశారో తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.

ఎన్టీఆర్ 30వ సినిమా ఓపెనింగ్ రోజే దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా రక్తపాతం, మాస్, క్రూయల్టీ ఉంటుందని చెప్పాడు. దీంట్లో ఎన్టీఆర్ చాలా రఫ్ లుక్ లో, మరింత మాస్ గా కనిపిస్తాడని సమాచారం. దీంతో మొదట జరిగిన షెడ్యూల్ లో ఎన్టీఆర్ తక్కువ గడ్డంతో, సాఫ్ట్ లుక్ లో పాల్గొన్నాడు. రాబోయే షెడ్యూల్ లో ఫుల్ గడ్డంతో ఎన్టీఆర్ లుక్ కావాలంట. అందుకే ఎన్టీఆర్ గడ్డం పెంచడానికి షూటింగ్ కి నెల రోజులు బ్రేక్ ఇచ్చారట. గడ్డం పెంచడానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ లోపు ఎన్టీఆర్ లేని సీన్స్ ని షూట్ చేసుకోవచ్చు కదా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా ఓపెనింగ్ రోజు గడ్డంతోనే ఉన్నాడు కదా, మొదట ఆ సీన్స్ తీయొచ్చు కదా అని మరికొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read :    Director Raj : ‘మల్లేశం’ డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమా.. సైలెంట్ గా సినిమా కంప్లీట్ చేసేశాడుగా..

  Last Updated: 14 Apr 2023, 07:59 PM IST