Samantha : పుష్ప 2లో సమంత కానీ అందుకు కాదా.. సుకుమార్ ప్లాన్ ఏంటో..?

Samantha సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్టైన సినిమా పుష్ప పార్ట్ 1 ది రైజ్. త్వరలో పార్ట్ 2 పుష్ప ది రూల్ రాబోతుంది. సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా

Published By: HashtagU Telugu Desk
Samantha Blasting Remuneration for Citadel

Samantha Blasting Remuneration for Citadel

Samantha సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్టైన సినిమా పుష్ప పార్ట్ 1 ది రైజ్. త్వరలో పార్ట్ 2 పుష్ప ది రూల్ రాబోతుంది. సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా అనుకున్న డేట్ కు సినిమాను తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ తెగ కష్టపడుతున్నారు.

సినిమా నుంచి లీక్ అవుతున్న ఫోటోస్ అన్నీ పుష్ప 2 మీద మరింత హైప్ తెస్తున్నాయి. పుష్ప 2 నెవర్ బిఫోర్ అనిపించే రికార్డులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మరో అందాల భామని ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది.

పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం ఎవరిని తీసుకుంటారు అన్నది పెద్ద చర్చ నడుస్తుంది. అయితే పుష్ప 1 లో ఉ అంటావా మావా అంటూ ఒక ఊపు ఊపిన సమంత ని కూడా పుష్ప 2 లో సాంగ్ చేయమని అడిగారట. కానీ సమంత అందుకు నో చెప్పినట్టు తెలుస్తుంది. సుకుమార్ రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. పుష్ప 1 లో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. సమంత తన హిట్ సెంటిమెంట్ గా భావిస్తున్న సుక్కు పుష్ప 2లో కూడా ఆమెను రిపీట్ చేయాలని చూస్తున్నారు.

పుష్ప 2లో స్పెషల్ సాంగ్ లో కాకపోయినా సంతన క్యామియో రోల్ అయినా ఉండేలా చూస్తున్నాడట. సమంత అందుకైనా ఓకే అంటుందా లేదా అన్నది చూడాలి. ఆల్రెడీ అల్లు అర్జున్ తో సమంత జత కట్టింది కాబట్టి పుష్ప 2 హైప్ పెంచేందుకు సమంత తన వంతు సాయం చేస్తుందని చెప్పొచ్చు. ఇక పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ ని యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రితో చేయించే ప్లానింగ్ లో ఉన్నట్టు లేటెస్ట్ టాక్. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Also Read : Trisha : అలా విడిచిపెట్టలేక అక్కడ సినిమాలు వదిలేశా అంటున్న త్రిష..!

  Last Updated: 25 Mar 2024, 05:34 PM IST