Site icon HashtagU Telugu

Nitin : మాస్ ఇమేజ్ కోసం నితిన్ ప్రయత్నాలు.. ఈసారైనా ఫలిస్తాయా..?

Nitin Tammudu Poster Creates Interesting Buzz

Nitin Tammudu Poster Creates Interesting Buzz

లవర్ బోయ్ ఇమేజ్ తో కెరీర్ నెట్టుకొస్తున్న నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ అనే సినిమాతో పాటుగా తమ్ముడు అనే సినిమా కూడా చేస్తున్నాడు. రాబిన్ హుడ్ సినిమా వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తునాడు.. తమ్ముడు సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నాడు. ఐతే లేటెస్ట్ గా తమ్ముడు నుంచి రిలీజ్ డేట్ పోస్టర్ వదిలారు మేకర్స్. అ పోస్టర్ చూస్తే మాస్ సినిమాగా తమ్ముడు వస్తున్నట్టు తెలుస్తుంది.

లవర్ బోయ్ ఇమేజ్ ఉన్నా కూడా నితిన్ (Nitin) చాలాసార్లు మాస్ ఇమేజ్ కోసం బాగా ట్రై చేశాడు. కానీ అతను చేసిన అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. ఐతే ఈసారి వేణు శ్రీరాం (Venu Sriram) తో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. పోస్టర్ చూస్తేనే ఇంటెన్స్ గా ఉంది. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా సినిమా ఆశించిన స్థాయిలోనే ఉండే అవకాశం ఉంటుంది.

నితిన్ తమ్ముడు సినిమాలో నిన్నటితరం హీరోయిన్ లయ నటిస్తుంది. సినిమాలో ఆమె సిస్టర్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి మాస్ ఇమేజ్ కోసం నితిన్ చేస్తున్న ఈ తమ్ముడు (Tammudu) ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. నితిన్ వేణు శ్రీరాం దిల్ రాజు ఈ ముగ్గురు ఈ సినిమా రిజల్ట్ మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్నై చూడాలంటే మహా శివరాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read : Bellamkonda Bhairavam : భైరవం టైటిల్ తో బెల్లంకొండ సినిమా.. రీమేక్ కథ కలిసి వస్తుందా..?