Site icon HashtagU Telugu

Nithin : నితిన్ కొత్త సినిమా టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్..

Nithin 32 Movie Title and Releasing date announced

Nithin 32 Movie Title and Releasing date announced

నితిన్(Nithin) కెరీర్ ప్రతీసారి అప్ అండ్ డౌన్స్ లోనే ఉంటుంది. ఒక్కోసారి వరుసగా హిట్స్ కొడితే ఒక్కోసారి ఫ్లాప్స్ కొడుతున్నాడు. భీష్మ, రంగ్‌దే సినిమాలతో హిట్స్ కొట్టిన నితిన్ ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఫ్లాప్ చూశాడు. ప్రస్తుతం నితిన్ తన 32వ సినిమాతో రాబోతున్నాడు.

శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా నితిన్ 32వ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒకేసారి మూడు అప్డేట్స్ ఇచ్చారు చిత్రయూనిట్. నితిన్ 32వ సినిమా నుంచి నితిన్ ఫస్ట్ లుక్, టైటిల్, రిలీజింగ్ డేట్ అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే వెరైటీ టైటిల్ ని ప్రకటించారు. అలాగే ఈ సినిమాని డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో నితిన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read : Bhola Shankar Trailer: 27న భోళాశంకర్ నుంచి ట్రైలర్, గెట్ రెడీ..