Raakasa Movie ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నిర్మాతగా నిహారిక కొణిదెల మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ఆమె నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై సంగీత్ శోభన్ హీరోగా ‘రాకాస’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
- ఆసక్తి రేపుతున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్
- ఏప్రిల్ 3న సినిమా విడుదల
- హీరోగా నటిస్తున్న సంగీత్ శోభన్
- సెటైరికల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న మూవీ
గ్లింప్స్ ప్రారంభంలో “ప్రతీ కథలో ఒక సమస్య, దాన్ని పరిష్కరించడానికి ఒక వీరుడు ఉంటాడు” అంటూ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. ఆ వీరుడు తనేనంటూ సంగీత్ శోభన్ ఎలివేషన్ ఇచ్చుకోవడం ఆసక్తి రేపుతుంది. అయితే, ఆ వెంటనే కథ సెటైరికల్, కామెడీ టర్న్ తీసుకోవడంతో గ్లింప్స్ సరదాగా సాగుతుంది. దీన్నిబట్టి సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నట్లు స్పష్టమవుతోంది.
మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, నిహారికతో కలిసి ఉమేశ్‌కుమార్ బన్సల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌ను ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
