Niharika konidela: రెడ్ డ్రెస్ లో హాట్ పోజులతో రచ్చ రచ్చ చేస్తున్న నిహారిక.. ఫోటోస్ వైరల్?

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 10:00 AM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న నిహారిక తన అల్లరి చేష్టలతో చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరించింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరి హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది నిహారిక. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జైపూర్ ప్యాలెస్ లో జరిగిన విషయం తెలిసిందే.

కానీ అది కూడా మూడు నాలుగు ముచ్చటే అయింది. పెళ్లి అయినా మూడేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయింది నిహారిక. విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక తన కొత్త జర్నీని మళ్ళీ మొదలుపెట్టింది. ఈ మధ్యకాలంలో నిర్మాతగా రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. ఇటీవల కాలంలో ఆమె తరచూ బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంతో కొందరు నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. కానీ అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది నిహారిక.

ఇది ఇలా ఉంటే తాజాగా నిహారిక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో నిహారిక రెడ్ డ్రెస్ లో సిగ్గుపడుతూనే హట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సిగ్గుపడుతూ తల కిందకు దించుకున్న ఫోటోలు షేర్ చేసింది. ఆ రెడ్ కలర్ డ్రెస్ లో నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది మెగా డాటర్. ఆ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్స్ ఇందుకోసమేనా నువ్వు విడాకులు తీసుకుంది అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు విడాకులు తీసుకున్న బాధ నీలో కొద్దిగా కూడా కనిపించడం లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేసింది నిహారిక..