Niharika Konidela : ‘కోరిక’ తీర్చుకోవడం కోసమే రెండో పెళ్లి చేసుకుంటా – మెగా డాటర్ నిహారిక

మెగా డాటర్ నిహారిక (Niharika konidela ) రెండో పెళ్లి (2nd Wedding) చేసుకుంటుందా..? చేసుకుంటే ఎవర్ని చేసుకుంటుంది..? మళ్లీ ప్రేమ పెళ్లే చేసుకుంటుందా..లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుందా..? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఆమెకు ఉందా..లేదా..? ఇలా అనేక ప్రశ్నలు గత కొద్దీ రోజులుగా మెగా అభిమానుల్లో మెదులుతూ ఉన్నాయి. కానీ వీటికి సమాధానం చెప్పే ధైర్యం ఎవ్వరు చేయలేదు. కానీ వీటికి ఎవరు చెప్పాలో…వారే చెప్పారు. వారే నిహారిక. మెగా ఫ్యామిలీ నుండి […]

Published By: HashtagU Telugu Desk
Niharika 2nd Wedding

Niharika 2nd Wedding

మెగా డాటర్ నిహారిక (Niharika konidela ) రెండో పెళ్లి (2nd Wedding) చేసుకుంటుందా..? చేసుకుంటే ఎవర్ని చేసుకుంటుంది..? మళ్లీ ప్రేమ పెళ్లే చేసుకుంటుందా..లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుందా..? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఆమెకు ఉందా..లేదా..? ఇలా అనేక ప్రశ్నలు గత కొద్దీ రోజులుగా మెగా అభిమానుల్లో మెదులుతూ ఉన్నాయి. కానీ వీటికి సమాధానం చెప్పే ధైర్యం ఎవ్వరు చేయలేదు. కానీ వీటికి ఎవరు చెప్పాలో…వారే చెప్పారు. వారే నిహారిక.

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మెగా అభిమానులను సంతోష పెట్టిన నిహారిక.. ముందుగా బుల్లితెర ఫై యాంకర్ గా కెరియర్ ప్రారంభించి..సందడి చేసింది. ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. కాగా 2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందీ. ఇరు కుటుంబాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. పెళైన ఏడాదిన్నరకే వీరిద్దరూ కోర్టుల ద్వారా విడిపోయారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేధికగా ప్రకటించారు కూడా. ఆ తర్వాత నుంచి మెగా డాటర్ తన తల్లిదండ్రుల వద్దే ఉంటూ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించడం , నిర్మించడం చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక రెండో పెళ్లి ఫై స్పష్టత ఇచ్చింది. రెండో పెళ్లి చేసుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు..ఎస్ చేసుకుంటా..కానీ ఇప్పుడే కాదు కాస్త సమయం తీసుకొని చేసుకుంటా అని తెలిపింది. తనకు పిల్లలు అంటే ఇష్టమని..ఆ ఇష్టం కోసమైన పెళ్లి చేసుకోవాలి కదా..అందుకే రెండో పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది. అయితే తనకు ప్రేమ మీద ఇంకా నమ్మకం ఉందని తెలిపింది. ప్రేమ మీద నెగెటివ్‌ ఇంప్రెషన్‌ అయితే లేదు. ఒక రిలేషన్‌షిప్‌ వర్కవుట్‌ కాలేదంటే ఎన్నో కారణాలుంటాయి. అలా పలు కారణాలతో నా పెళ్లి కూడా వర్కవుట్‌ కాలేదు. అలా అని మళ్లీ ఒకరిపై ప్రేమ పుట్టదు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది ‘ అని చెప్పుకొచ్చింది.

Read Also : Viveka Murder : చిన్నాన్నను బంధువులే హత్య చేసారు – వైస్ షర్మిల

  Last Updated: 15 Mar 2024, 02:40 PM IST