Site icon HashtagU Telugu

Nidhhi Agerwal : పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫిర్యాదు

Nidhhi Agerwal Files Cyberc

Nidhhi Agerwal Files Cyberc

సినీ తారలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో వేధింపులు, బెదిరింపులు (Harassment and Threats on Social Media) ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్‌ (Nidhi Agarwal) కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తనపై సోషల్‌ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు ( Cybercrime Complaint) చేశారు.

Tirupati Stampede Incident : ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ వేడుక రద్దు

తనను చంపేస్తానంటూ సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని నిర్దేశించి నిధి ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి తనకు దగ్గరి వారిని కూడా లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన తనను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని, నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

నిధి అగర్వాల్ ఫిర్యాదును స్వీకరించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వివరాలు సేకరించి, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిధి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నిధి అగర్వాల్‌ ప్రముఖ హీరోలతో పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రభాస్‌తో రాజాసాబ్‌, పవన్‌ కల్యాణ్‌ సరసన హరి హర వీర మల్లు చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్నాయి.