Nidhhi Agerwal : ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా హారర్ కామెడీ అని కూడా చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్ తాత మనవాళ్లుగా కనిపించబోతున్నారు. ప్రభాస్ మొదటిసారి హారర్ చేస్తుండటం, మొదటిసారి తాత గెటప్ లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
తాజాగా నిధి అగర్వాల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడింది.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. రాజాసాబ్ ఒక హారర్ రొమాంటిక్ కామెడీ సినిమా. సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రాజాసాబ్ సెట్ మాత్రం అదిరిపోయింది. నేను ఇప్పటివరకు అలాంటి సెట్ చూడలేదు. ఈ సినిమాలో నేను దయ్యం పాత్ర కాదు కానీ నేను కూడా భయపెడతాను. నా పాత్ర చూసి కూడా ప్రేక్షకులు భయపడతారు. ప్రభాస్ గారితో కలిసి పనిచేయడం చాలా అనుభవాలు ఇచ్చింది. ఆయన చాలా స్వీట్ పర్సన్ అని తెలిపింది.
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ దయ్యం పాత్ర అని ఆల్రెడీ గతంలో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తోనే అర్ధమయిపోయింది. ఇప్పుడు నిధి చెప్పినట్టు నిధి మాత్రం దయ్యం కాదు అంటే కేవలం ప్రభాస్ ఒక్కడే దయ్యంగా భయపెడుతున్నాడా లేక వేరే హీరోయిన్స్ లో దయ్యం పాత్రలు చేస్తున్నారా చూడాలి. ఇక నిధి అగర్వాల్ మరో పక్క పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది.
Also Read : Jagga Reddy : యాక్టర్‌గా జగ్గారెడ్డి.. ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర