Site icon HashtagU Telugu

New Twist in Jani Master Case : జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్..

New Twist

New Twist

అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసు (Jani Master Case)లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భర్త‌ను కావాల‌ని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపుల‌కు గురిచేసిందంటూ సదరు లేడి డ్యాన్స‌ర్‌పై ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌కు జానీ మాస్ట‌ర్ భార్య సుమ‌ల‌త (Jani Wife Sumalatha) ఫిర్యాదు చేసింది.

కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఐదేళ్లుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది. నాకు అమ్మ వద్దు.. నాన్న వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. నా భర్త జానీ మాస్టర్ ను ఇంటికి రాకుండా అడ్డుకునేది.. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేదని ఫిర్యాదులో పేర్కొంది సుమలత.

ఇక, బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ ను నువ్వు ఇష్టపడితే.. ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతాను అని చెప్పాను అన్నారు సుమలత.. కానీ, బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు.. మీరు నాకు వదిన అంటూ నమ్మించింది.. నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్లతో బాధితురాలికి అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది.. అయితే, ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు.. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది.. పేరున్న.. డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుందని.. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొంది.

అలాగే ఈ విష‌యంలో జానీ మాస్ట‌ర్ నిర్దోషి అని త‌ప్ప‌కుండా బ‌య‌టికి వ‌స్తాడు. కోర్టు ప్ర‌క‌టించేవ‌ర‌కు వెయిట్ చేయండి. అలాగే ఈ మ‌ధ్య చూస్తున్న న్యూస్ ఛాన‌ల్స్ జానీ మాస్ట‌ర్ నేరం ఒప్పుకున్నాడు అని వార్త‌లు ప్ర‌చురిస్తున్నారు. ఆ వార్త‌ల‌న్ని అబ‌ద్దం. అత‌డు నేరం అంగీకరించలేదు అంటూ సుమ‌ల‌త క్లారిటీ ఇచ్చింది. మరోపక్క కస్టడీలో జానీ మాస్టర్ కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్‌ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఆ అమ్మాయి ట్యాలెంట్‌ను చూసి మాత్రమే తనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్ ఇచ్చానని, ఆ అమ్మాయి విషయంలో తాను పడుతున్న ఇబ్బంది గురించి డైరెక్టర్ సుకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు జానీ తెలిపినట్టు సమాచారం. అయితే.. ఆమెను పిలిచి సుకుమార్ మాట్లాడారని.. అయినా సరే ఆమెలో ఎలాంటి మార్పు లేదని జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎవరిది కరెక్ట్..ఎవరిది తప్పు అనేది పోలీసులే తెలుస్తారు.

Read Also : Death Penalty : నేరం రుజువైతే కోల్‌కతా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు మరణశిక్ష: సీబీఐ కోర్టు