Site icon HashtagU Telugu

Pallavi Prashanth : రైతుబిడ్డ అసలు రంగు బయటపడుతుందా..?

Police file a case on Bigg Boss 7 Winner Pallavi Prashanth and His Fans

Police file a case on Bigg Boss 7 Winner Pallavi Prashanth and His Fans

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) అసలు రంగు బయటపడుతుందా..? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ‘అన్నా.. మల్లొచ్చినా..’, ‘అన్నా.. నాకు బిగ్‌బాస్‌లో ఛాన్స్ ఇవ్వండన్నా’ యూట్యూబ్‌ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చి తనకు సపోర్ట్‌ చేయమన్న రైతుబిడ్డ… తీరా ఇప్పుడు కప్ తో పాటు భారీ ఎత్తున డబ్బు పట్టుకొని బయటకు వచ్చిన ప్రశాంత్..రెండోరోజే అసలైన తన నిజ స్వరూపం బయటపెడుతున్నాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss 7 Telugu ) గ్రాండ్ గా ముగిసింది..అంత భావించినట్లే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Raithu Bidda Pallavi Prashanth) టైటిల్ విన్నర్ గా కప్ గెలుచుకున్నాడు. కేవలం కప్ మాత్రమే కాదు కోట్లాది మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. బిగ్ బాస్ లో ఎలాగైనా వెళ్లాలని పట్టుదలతో తన ప్రయాణం మొదలుపెట్టాడు..సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరిని వేడుకుంటూ..చివరికి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టడమే కాదు ఈరోజు టైటిల్ విన్నర్ గా కప్ గెలుచుకొని ఇంటికి వెళ్లాడు. ఈ గెలుపు ఓ రైతుబిడ్డ సాధించిన విజయంగా ఫ్యాన్స్ చెప్పుకున్నారు. కానీ ఇదంతా నిన్నటివరకే. షో లో ఎంతో మర్యాదగా, పద్దతిగా కనిపించిన ప్రశాంత్.. ప్రవర్తనలో మార్పు మొదలైంది. టైటిల్‌ గెలిచిన తర్వాత ప్రశాంత్‌ కాళ్లు భూమి మీద లేవు. గాల్లో తేలుతున్నాడు. మొన్నటి వరకు యూట్యూబర్లను దేవుళ్ళని చెప్పిన ప్రశాంత్..ఇప్పుడు యూట్యూబ్‌ యాంకర్లను అస్సలు పట్టించుకోవడం లేదట. అంతే కాదు ఇంటర్వ్యూ అడిగితే కూడా చాలా దురుసుగా, చులకన చేసి మాట్లాడుతున్నాడట.

We’re now on WhatsApp. Click to Join.

ఒక్క ఇంటర్వ్యూ అని అడిగితే.. ‘మీరు మా పొలం దగ్గరకు రండి.. పనులు చేయండి.. వీడియో తీసుకోండి. మీ యూట్యూబ్‌ ఛానల్స్‌ నుంచి రైతులకు ఏమిస్తారో చెప్పుర్రి. ఆ తర్వాతే మీకు ఇంటర్వ్యూలు ఇస్తా..’ అంటూ ఎగతాళిగా మాట్లాడుతున్నాడట. “మీ సమీపంలోనే మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ ఉంది, మీరు రైతుగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోయిన దాదాపు 14 గ్రామాల రైతులకు గతంలో ఏమైనా సాయం చేశారా? వారికి మద్ధతుగా నిలిచారా?” అని ఓ టీవీ ఛానెల్ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు వెటకారంగా బదులిచ్చాడు. ‘నాకేమైనా సీఎం పదివి ఇచ్చిర్రా? ఏదైనా చేయడానికి! నేను ఒక రైతుబిడ్డను కదా.. సీఎం చేస్తరా చెప్పుండ్రి.. అందరినీ ఆదుకుంటా.. నేనేమైనా నాయకుడినా? నేనూ ఒక రైతుబిడ్డనే.. నేనేం చేస్తా’ అని వెకిలిగా నవ్వుతూ జవాబు ఇచ్చాడట. ఇలా ఎవరు ఏ ప్రశ్న అడిగిన దానికి రివర్స్ లో సమాదానాలు చెపుతుంటే సదరు యాంకర్లకు ఆవేశం తన్నుకొస్తోంది. ఛీ ఇలాంటి వాడికా..సపోర్ట్ చేసింది…బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్ చెపుతూనే ఉన్నాడు..ప్రశాంత్ లో మరో కోణం ఉందని..కానీ మనమే పట్టించుకోలే అని ఒకరికికారు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక నెటిజన్లు సైతం ప్రశాంత్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Pongal Movies : సంక్రాంతి సినిమాలు వేటికవే ప్రత్యేకం..!