Netflix CEO Meet Mega Family: మెగా హీరోలతో ‘నెట్‌ఫ్లిక్స్‌’ కో- సీఈవో భేటీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ఇంటికి నెట్‌ఫ్లిక్స్‌ కో- సీఈవో చేరుకోగా చరణ్‌తో (Netflix CEO Meet Mega Family)పాటు ఆయన తండ్రి చిరంజీవి, హీరోలు సాయిధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌ స్వాగతం పలికారు.

Published By: HashtagU Telugu Desk
Netflix CEO Meet Mega Family

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Netflix CEO Meet Mega Family: ప్రముఖ OTT నెట్‌ఫ్లిక్స్‌ కో- సీఈవో టెడ్‌ సరాండొస్‌ గురువారం హైదరాబాద్‌ కు వచ్చారు. నేరుగా మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ఇంటికి ఆయన చేరుకోగా చరణ్‌తో (Netflix CEO Meet Mega Family)పాటు ఆయన తండ్రి చిరంజీవి, హీరోలు సాయిధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌ స్వాగతం పలికారు. వీరందరితో టెడ్‌ సరదాగా కాసేపు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నెట్‌ఫ్లిక్స్ సీఈఓ రామ్ చరణ్, చిరంజీవిని కలవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర'( వర్కింగ్ టైటిల్ ), రామ్ చరణ్ ‘ గేమ్ ఛేంజర్’ మూవీలతో బిజిగా ఉన్నారు.

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న OTT మార్కెట్ కారణంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి అమెరికన్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల అధిపతులందరూ తరచుగా హైదరాబాద్‌ను సందర్శిస్తారు. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్‌ కో- సీఈవో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవిలను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Ginger Tea : అల్లం టీ ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే…

మెగా హీరోలతో కలిసి టెడ్ సరదాగా ముచ్చటించారు. సెల్ఫీలు తీసుకున్నారు. టెడ్ తోపాటు నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు కూడా రామ్ చరణ్ ఇంటికి వెళ్లారు. వీరితో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శోభు యార్లగడ్డ ఉన్నారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతూ అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించిన విషయం మనకు తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 08 Dec 2023, 07:05 AM IST