మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న నిహారిక(Niharika), ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అనంతరం జొన్నలగడ్డ చైతన్యతో వివాహం చేసుకుని, కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. “కమిటీ కుర్రోళ్లు” వంటి విజయవంతమైన సినిమా నిర్మించి మంచి పేరు పొందారు, దీనికి గాను ఆమె అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆమె తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
Home Loan EMI: ఇలా చేస్తే మీ హోమ్ లోన్ ఈఎంఐ ఈజీగా రూ. 4 వేలు తగ్గించుకోవచ్చు
తాజాగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిహారిక తన స్నేహితురాలు అంబటి భార్గవితో కలిసి ఒక కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆమె తెలిపారు. నిహారిక స్నేహితులు వెతిక, మహాతల్లి కూడా ఈ కొత్త ప్రయోగంపై ఆసక్తిగా ఉన్నట్లు పోస్టులు పెట్టారు. ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది, ఆమె చేయబోయే కొత్త ప్రాజెక్ట్ ఏమిటని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిహారిక విడాకుల విషయంపై సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కొందరు నెటిజన్లు నాగబాబును విమర్శిస్తూ, కూతురిని గారాబంగా పెంచడం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జంటను ఆదర్శంగా తీసుకొని, నిహారిక కూడా తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని, తనకు నచ్చిన వ్యక్తిని త్వరగా వివాహం చేసుకొని స్థిరపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిహారిక త్వరలో చెప్పబోయే శుభవార్త ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినదా, లేక వృత్తిపరమైనదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.