Site icon HashtagU Telugu

Nayan-Vignesh: నెట్టింట వైరల్ అవుతున్న నయన్, విగ్నేష్ శివన్ లేటెస్ట్ రొమాంటిక్ ఫోటోస్?

Mixcollage 15 Feb 2024 07 58 Am 9992

Mixcollage 15 Feb 2024 07 58 Am 9992

తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన నయనతార ప్రస్తుతం కోలీవుడ్,బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతూ, టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. నయనతార దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. అయితే సరోగసి ద్వారా నేను ద్వారా కవల పిల్లలకు తల్లి అయిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు సినిమాలలో హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నయనతార తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో 8 ఏళ్ల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యువతకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది.

నయనతార సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా నయన్, విగ్నేష్ శివన్ లేటెస్ట్ రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోల పై అభిమానులు క్రేజీ కామెట్స్ చేస్తున్నారు. వాలెంటెన్స్ సందర్భంగా నయనతార, విగ్నేష్ ల రొమాంటిక్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం విగ్నేష్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉండగా నయనతార సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.